Bank Accounts: చదువుకునేందుకు విదేశాలకు వెళ్లిన వారి బ్యాంక్ అకౌంట్లను ఏం చేస్తారు..? వేరే దేశంలో బ్యాంక్ ఖాతా కావాలంటే..!
ABN , First Publish Date - 2023-07-08T18:53:53+05:30 IST
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. చాలా మంది తమ కలలను సాకారం చేసుకుంటారు. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ ఏ యూనివర్సిటీలో అప్లయ్ చేయాలి? ఎలా సన్నద్ధం కావాలి? ఫీజులు ఎంత? వంటి అన్ని విషయాలు తెలుసుకుంటారు.
విదేశాల్లో ఉన్నత చదువులు (Foreign Studies) చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. చాలా మంది తమ కలలను సాకారం చేసుకుంటారు. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అక్కడ ఏ యూనివర్సిటీలో (Foreign Universities) అప్లయ్ చేయాలి? ఎలా సన్నద్ధం కావాలి? ఫీజులు ఎంత? వంటి అన్ని విషయాలు తెలుసుకుంటారు. అయితే బ్యాంకు ఖాతాల (Bank Accounts) విషయంలో మాత్రం చాలా మందికి సందేహాలు ఉంటాయి. కొందరు ఆ విషయం గురించి పట్టించుకోకుండా చివరి నిమిషంలో ఇబ్బందులు పడుతుంటారు.
విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు భారతదేశంలోని బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO) లేదా నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (NRE) ఖాతాగా మార్చడం అవసరమా? అవును.. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండాల్సిన సందర్భంలో ఆ విషయాన్ని తప్పనిసరిగా మీ ఖాతా ఉన్న బ్యాంకు వారికి చెప్పాలి. అప్పుడు ఆ బ్యాంకు ఆ విద్యార్థి బ్యాంక్ అకౌంట్‌ను ఫారెన్ కరెన్సీ అకౌంట్ (Foreign Currency Account)గా మారుస్తుంది. ఇక, ఇక్కడ ఉండే కుటుంబ సభ్యుడితో లేదా బంధువుతో జాయింట్ అకౌంట్ హోల్డర్‌గా కూడా మారవచ్చు.
Success Tips: ఎవరీ రోమన్ సైనీ..? 30 ఏళ్ల వయసుకే 25 వేల కోట్ల బిజినెస్.. అసలు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడంటే..!
విదేశాల్లోని అనేక బ్యాంకులు ఫోన్ ద్వారా కానీ, ఆన్‌లైన్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని చెబుతుంటాయి. అయితే మీరు నేరుగా బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయడం ఉత్తమం. అంతర్జాతీయ విద్యార్థిగా స్థానిక బ్యాంకులు పెట్టే చాలా నిబంధనలు సరిపోవు. ఈ నేపథ్యంలో నేరుగా బ్యాంకుకు వెళ్లి సిబ్బందితో ముఖాముఖి మాట్లాడుకోవడమే ఉత్తమం.