Multiple Bank Accounts: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే నష్టం ఏముంటుందిలే అనుకుంటున్నారేమో.. ఈ విషయాలు తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-07-08T15:30:34+05:30 IST
గత పది, పదిహేనేళ్లుగా బ్యాంకు ఖాతా అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. అలాగే బ్యాంకు ఖాతా తెరవడం సులభతరం కూడా అయిపోయింది. దీంతో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కూడా ఉంటున్నాయి. రకరకాల బ్యాంకులు ఇస్తున్న ఆఫర్ల వల్ల కూడా బ్యాంకు ఖాతాలు పెరుగుతున్నాయి.
గత పది, పదిహేనేళ్లుగా బ్యాంకు ఖాతా (Bank Account) అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. అలాగే బ్యాంకు ఖాతా తెరవడం సులభతరం కూడా అయిపోయింది. దీంతో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు (Multiple Bank Accounts) కూడా ఉంటున్నాయి. రకరకాల బ్యాంకులు ఇస్తున్న ఆఫర్ల వల్ల కూడా బ్యాంకు ఖాతాలు పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) కూడా ఒక వ్యక్తికి ఉండాల్సిన బ్యాంకు ఖాతాలపై ఎలాంటి పరిమితులను విధించలేదు. దీంతో ఒక వ్యక్తి 4, 5 బ్యాంకు ఖాతాలను కూడా కలిగి ఉండవచ్చు.
ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండడం వల్ల నష్టం ఏముందిలే అనుకోవచ్చు. కానీ, అవసరమైన వాటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఆర్థిక ప్రణాళిక (Financial planning): ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం వల్ల వాటిని ట్రాక్ చేయడం మీకు కష్టంగా మారవచ్చు. వివిధ బ్యాంకులు రకరకాల సందర్భాల్లో విధించే నిబంధనలను మీరు తెలుసుకోలేకపోవచ్చు. అందువల్ల మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ దెబ్బతినవచ్చు. ఖాతాలు ఉన్న అన్ని బ్యాంకుల నుంచి మీరు క్రెడిట్ కార్డులు తీసుకున్నట్టైతే మీరు ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవచ్చు.
మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ (Minimum bank balance): మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉంటే అన్నింట్లోనూ మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు మీ ఖతాలన్నింటిలోనూ మీ డబ్బు లాక్ అయిపోతుంది. లేకపోతే మీరు జరిమానా (Fine) చెల్లించాల్సి ఉంటుంది.
మెయింటనెన్స్ ఛార్జ్: ప్రతి బ్యాంకు మీకు సర్వీస్‌లను అందిస్తున్నందుకు మీ నుంచి కొంత ఛార్జీ వసూలు చేస్తుంది. మీకు మెసేజ్‌లు పంపిస్తున్నందుకు, ఏటీఎమ్ (ATM) సేవలు అందిస్తున్నందుకు, వార్షిక సర్వీస్ ఛార్జ్.. ఇలా మీరు ఎంతో కొంత బ్యాంకుకు కట్టాల్సి ఉంటుంది.
బ్యాంకులకే లాభం: అవసరం లేకపోయినా ఖాతాలు తెరిస్తే మీ కంటే బ్యాంకులే ఎక్కువ లాభపడతాయి. బ్యాంకులు అందిస్తున్న సౌకర్యాలను, వసూలు చేస్తున్న ఛార్జ్‌లను జాబితా వేసి చూసుకోవాలి. ఖర్చుల కంటే సౌకర్యాలు ఎక్కువగా ఉంటేనే బ్యాంకు ఖాతాను కొనసాగించాలి.
పొదుపు ఖతా కాకుండా ఇంకా చాలా రకాల ఖాతాలు ఉంటాయి. కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, జాయింట్ అకౌంట్.. ఇలా మీ అవసరకాలకు ఏది ఉత్తమమో దానిని మాత్రమే ఎంచుకుని మిగిలినవి క్లోజ్ చేసుకుంటే మంచిది.