మిడతల ఆగడాలకు గబ్బిలాల అడ్డుకట్ట.. పరిశోధనల్లో వెల్లడైన ఆశ్చర్యకర విషయాలు!
ABN , First Publish Date - 2023-04-16T09:20:00+05:30 IST
గబ్బిలాలు.. ఈ పేరు వినగానే చాలామందికి అసహ్యం కలుగుతుంది. అయితే గబ్బిలాలు(Bats) మనకు చేసే మేలు గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
గబ్బిలాలు.. ఈ పేరు వినగానే చాలామందికి అసహ్యం కలుగుతుంది. అయితే గబ్బిలాలు(Bats) మనకు చేసే మేలు గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు(Bangalore)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC)కి చెందిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్.. ప్రొఫెసర్ రోహిణి బాలకృష్ణన్(Professor Rohini Balakrishnan) నేతృత్వంలో గబ్బిలాలపై పరిశోధన జరిగింది.
గబ్బిలాలు ఎక్కువగా ఆడ మిడతలను వేటాడుతాయని ఈ పరిశోధన(Research)లో తేలింది. ఈ విధంగా గబ్బిలాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మిడతల కారణంగా పొలాల్లోని పంటలకు విపరీతమైన నష్టం(Tremendous loss) వాటిల్లుతుంటుంది. మిడతల దండు... అంటే లక్షలాది మిడతలు ఒక్కసారిగా పంటలపై పడి వాటిని నాశనం(destroy) చేస్తుంటాయి. కొన్ని గంటల వ్యవధిలో పంట ధ్వంసం అవుతుంది. మిడతల జీవిత కాలం 3 నుండి 5 నెలలు.
ఆడ మిడుత ఒకేసారి 80 గుడ్లు పెడుతుంది. దీన్ని బట్టి వాటి జనాభా(population) ఎంత వేగంగా పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కాగా గబ్బిలాలు(Bats) కూడా అదే వేగంతో ఆడ మిడతలను వేటాడతాయి. ఈ విధంగా మిడతల జనాభా అదుపులోకి వస్తుంది. మిడతల సమూహాలు గబ్బిలాలు నివసించే ప్రాంతాల్లోని పొలాలపై(fields) దాడి చేయవు. మొత్తంగా చూస్తే రైతులకు గబ్బిలాలు ఎంతగానో సహాయం(help) చేస్తున్నాయని చెప్పవచ్చు.