Viral News: యజమాని చనిపోయాడని తెలియక.. ఏడాది నుంచి ఆస్పత్రి ముందే పడిగాపులు కాస్తున్న కుక్క..
ABN , First Publish Date - 2023-10-18T16:58:14+05:30 IST
మనుషులతో పోల్చుకుంటే కుక్కలు ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొంచెం ఆహారం, కాస్తంత ప్రేమ చూపిస్తే చాలు ఆ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. తమకు అన్నం పెట్టిన వాడిని ఎప్పటికీ మర్చిపోవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ కుక్క కథ చాలా మందిని కంట తడి పెట్టిస్తోంది.
మనుషులతో పోల్చుకుంటే కుక్కలు (Dogs) ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొంచెం ఆహారం, కాస్తంత ప్రేమ చూపిస్తే చాలు ఆ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. తమకు అన్నం పెట్టిన వాడిని ఎప్పటికీ మర్చిపోవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ కుక్క కథ (Heartbreaking story ) చాలా మందిని కంట తడి పెట్టిస్తోంది. యజమాని (Owner) పట్ల ఆ కుక్కకు ఉన్న అభిమానాన్నిచూసి చాలా మంది చలించిపోతున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన మోర్గాన్ అనే కుక్క కథ సోషల్ మీడియాలో వైరల్ (Viral Story) అవుతోంది.
ఫిలిప్పీన్స్ (Philippines)లోని కలోకాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రితం కరోనా బారిన పడ్డాడు. కుటంబ సభ్యులు అతడిని వెంటనే మనీలా సెంట్రల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో చేర్చారు. కుటుంబ సభ్యులతో పాటు అతడు పెంచుకుంటున్న మోర్గాన్ అనే కుక్క (Pet Dog) కూడా హాస్పిటల్‌కు వెళ్లింది. పగలు, రాత్రి ఆస్పత్రి వెలుపల తన యజమాని కూడా వేచి చూసింది. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని ఖననం చేశారు. ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లిపోయారు. అయితే మోర్గాన్ మాత్రం తన యజమాని లేని ఇంటి దగ్గర ఉండలేకపోయింది.
WhatsApp: మీ వాట్సాప్‌ను వేరే వాళ్లు ఎవరైనా ఉపయోగిస్తున్నారా..? ఇంకెక్కడయినా లాగిన్ అయి ఉందా..? ఎలా తెలుసుకోవచ్చంటే..!
చివరగా తన యజమానిని చూసిన హాస్పిటల్ దగ్గరకే వెళ్లిపోయేది. ఎప్పటికైనా తన యజమాని తిరిగి వస్తాడని అక్కడే ఎదురు చూసేది. హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు ఏదైనా ఆహారం ఇస్తే తినేది. హాస్పిటల్ మార్చురీ వద్ద నిద్రపోయేది. అలా ఏడాది పాటు తన యజమాని కోసం ఆస్పత్రి వెలుపల వెయిట్ చేసింది. ఫిలిప్పీన్స్ జంతు-సంక్షేమ స్వచ్ఛంద సంస్థ యానిమల్ కింగ్‌డమ్ ఫౌండేషన్ (AKF) మోర్గాన్ గురించి తెలుసుకుని, దానికి ఆహారం, టీకాలు అందిస్తోంది. మోర్గాన్ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.