Share News

Hot Water: చలికాలం వచ్చేసింది.. వేడి నీళ్ల స్నానం చేసేందుకు గీజర్ లేదా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

ABN , First Publish Date - 2023-10-21T15:47:54+05:30 IST

మన దేశంలో చలికాలం మొదలైంది. అప్పుడే చలిగాలులు వీయడం కూడా మొదలైంది. చలికాలం అనగానే చాలా మంది చన్నీళ్ల స్నానం గుర్తు చేసుకుని వణికిపోతుంటారు. నీటిని మరగబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా మంది గీజర్లను ఏర్పాటు చేసుకుని చక్కగా వేణ్నీళ్లతో స్నానం చేస్తారు.

Hot Water: చలికాలం వచ్చేసింది.. వేడి నీళ్ల స్నానం చేసేందుకు గీజర్ లేదా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

మన దేశంలో చలికాలం (Winter) మొదలైంది. అప్పుడే చలిగాలులు వీయడం కూడా మొదలైంది. చలికాలం అనగానే చాలా మంది చన్నీళ్ల స్నానం గుర్తు చేసుకుని వణికిపోతుంటారు. నీటిని మరగబెట్టేందుకు (Hot Water)ప్రయత్నిస్తుంటారు. చాలా మంది గీజర్లను (Geyser) ఏర్పాటు చేసుకుని చక్కగా వేణ్నీళ్లతో స్నానం చేస్తారు. అయితే అంత స్థోమత లేని వాళ్లు మాత్రం స్టవ్ మీద నీటిని వేడి చేసుకుంటుంటారు. అలా వేడి చేయడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మీరు తక్కువ ఖర్చుతో నీటిని వేడి చేసే హీటర్‌ను గనుక కొనాలనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి (Low Cost water heaters)..

NOVA సబ్‌మెర్సిబుల్ NIH 426 ఇన్‌స్టంట్ ఇమ్మర్షన్ హీటర్ రాడ్‌ను ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో కేవలం రూ. 425కి అందుబాటులో ఉంది. ఇది నిమిషాల వ్యవధిలో నీటిని వేడి చేస్తుంది. ఈ రాడ్ ఆరెంజ్ ప్లాస్టిక్ బాడీ, శక్తివంతమైన హీటింగ్ ఎలిమెంట్‌ను కలిగి ఉంది. అలాగే NIH430 ఇమ్మర్షన్ హీటర్ కూడా రూ.500కే అందుబాటులో ఉంది. ఇది షాక్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. పొరపాటును దీనిని పట్టుకున్నా ఎలాంటి షాక్ కొట్టదు.

Health Facts: మీరు పెరుగు ఎక్కువగా తింటుంటారా? అయితే ఇలా మాత్రం తినకండి.. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

అలాగే లాంగ్ వే LWIR01 ఇమ్మర్షన్ హీటర్ రాడ్‌ను రూ. 399కే ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులో కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది 1500W తో వస్తుంది. ఇది షాక్ ప్రూఫ్ అని కంపెనీ పేర్కొంది. అంటే విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం లేదు. ఇవి మాత్రమే కాదు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో మరికొన్ని వాటర్ హీటర్లు చాలా తక్కువ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. వాటిని కొనుకుంటే ఈ శీతాకాలం వెచ్చగా మారిపోతుంది.

Updated Date - 2023-10-21T15:47:54+05:30 IST