Viral: షాకింగ్ వీడియో! పరిగెత్తుకుంటూ వచ్చిన మహిళను చూడగానే విమానం ఆపేసిన పైలట్!
ABN , First Publish Date - 2023-11-03T21:24:42+05:30 IST
ఫ్లైట్ మిస్సైన ఓ మహిళ మరో విమానం ఎక్కేందుకు టార్మాక్‌పై పరిగెత్తుకొచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: విమానం ప్రయాణం చేసేవారు టైం కంటే కొద్దిగా ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. ఆ తరువాత చెకింగులు గట్రా అన్ని పూర్తయ్యాక సిబ్బంది ప్రయాణికులను విమానంలోకి అనుమతిస్తారు. కానీ, ఓసారి ఫ్లైట్ మిస్సైందంటే ఇక చేసేందుకు ఏమీ ఉండదు. సైలెంట్‌గా వెనుదిరగాలి లేదా మరో ఫ్లైట్ ఉందేమో ఎయిర్ పోర్టులోనే కనుక్కుని టిక్కెట్ బుక్ చేసుకోవాలి. అయితే, చివరి నిమిషంలో టిక్కెట్ కొనుక్కోవడమంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న పనే. అయితే, ఆస్ట్రేలియాలో ఓ మహిళ ఇలాగే ఫ్లైట్ మిస్సయ్యాక చేసిన పని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాక్కూడా జరుగుతుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.
Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..
క్యాన్బెరా ఎయిర్‌పోర్టులో(Canberra Airport) వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, ఓ మహిళ బుధవారం తన ఫ్లైట్ మిస్సైయ్యింది. మరొకరైతే నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు కానీ ఈ మహిళ మాత్రం మరీ వింతగా ప్రవర్తించింది. ఏ రన్నింగ్ బస్సో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆమె పరిగెత్తుకుంటూ రన్‌వేపైకి వెళ్లిపోయింది. అక్కడ కనిపించిన ఓ విమానం వద్దకు వెళ్లింది. విమానంలో ఎత్తున కూర్చున్న పైలట్‌ను పలకరించేందుకు ప్రయత్నించింది(Woman runs onto tarmac to catch a missed flight). విమానాశ్రయంలో ఇదంతా చూసిన వారు ఒక్కసారిగా షాకైపోయారు.
ఈలోపు రన్‌వే వద్ద ఉన్న సిబ్బంది పైలట్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో, కింద ఉన్న మహిళకు ఎలాంటి ఇబ్బందీ కలక్కుండా అతడు విమానం ఇంజిన్లను ఆపేశాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా పోలీసులు మహిళను అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు ఆస్తులను ధ్వంసం చేయడం, భద్రతా నిబంధనలను అతిక్రమించడం తదితర అభియోగాలతో ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, ఆమె ఎయిర్‌పోర్టులో విమానం వద్దకు వెళ్లిన దృశ్యం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.