కల్లు తాగేందుకు వచ్చిన బీఎస్ఎప్ జవాన్... డబ్బులు అడిగిన దుకాణదారు... మత్తులో జవాన్ ఎంతటి దారుణానికి పాల్పడ్డాడంటే...
ABN , First Publish Date - 2023-02-07T09:03:36+05:30 IST
బీహార్‌లోని సివాన్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్ కేవలం రూ.80 కోసం ఓ వ్యక్తిని కాల్చిచంపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
బీహార్‌లోని సివాన్ జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్ కేవలం రూ.80 కోసం ఓ వ్యక్తిని కాల్చిచంపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై విచారణ మొదలైంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉజ్వల్ పాండే నుంచి పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 4 లైవ్ కాట్రిడ్జ్‌లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహరాజ్‌గంజ్‌లోని పోఖారా గ్రామంలో జరిగింది. ఇక్కడ నివసించే మున్నీలాల్ కల్లు అమ్ముతుంటాడు. బిఎస్ఎఫ్ జవాన్ ఉజ్వల్ పాండే కల్లు తాగడానికి అక్కడకు వచ్చాడు. కల్లు తాగిన అనంతరం మున్నీలాల్ డబ్బులు అడగడంతో ఉజ్వల్ పాండేకు కోపం వచ్చింది. అతను అక్కడికక్కడే మూడు బుల్లెట్లను కాల్చాడు. దీంతో మున్నీలాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు బాధితుడిని శివన్ సదర్ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై మహరాజ్‌గంజ్ ఎస్‌డిపిఓ పోలాస్ట్ కుమార్ మాట్లాడుతూ నిందితుడు ఉజ్వల్ పాండేని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అతను మత్తులో ఉన్నాడు. అతను రతన్‌పూర్ నివాసి. అతని వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 4 లైవ్ కాట్రిడ్జ్‌లతో పాటు బైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మున్నీలాల్ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం.