Most Expensive House: ఈ ఇంటి ధర కేవలం రూ.1,675 కోట్లేనట.. దీన్ని నిర్మించడానికే ఏకంగా 12 ఏళ్లు పట్టిందట..!

ABN , First Publish Date - 2023-06-15T19:15:08+05:30 IST

దుబాయ్‌లోనే అత్యంత ఖరీదైన బంగళా తాజాగా అమ్మకానికి వచ్చింది. దీని ధర ఏకంగా 1675 కోట్లట. ఈ బంగళా విశేషాలను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.

Most Expensive House: ఈ ఇంటి ధర కేవలం రూ.1,675 కోట్లేనట.. దీన్ని నిర్మించడానికే ఏకంగా 12 ఏళ్లు పట్టిందట..!

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లోనే అత్యంత ఖరీదైన బంగళా(Most Expensive house in Dubai) అమ్మకానికి వచ్చింది. దీని ధర ఏకంగా రూ. 1675 కోట్లని అక్కడి మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిందో లేదో బయ్యర్లు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అంతేకాదు.. దీన్ని కొనేందుకు భారతీయ కుబేరులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇంత ఖరీదైన ఈ బంగళా విశేషాలేంటో చూద్దాం పదండి మరి..

8.jpg

ఈ భవనాన్ని స్థానికంగా మార్బల్ ప్యాలెస్ అని పిలుస్తుంటారు. తెల్లటి పాలరాతితో కళ్లు చెదిరేలా ఉంటే ఈ భవంతి 70 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ భవంతి ఎదురుగా పెద్ద గోల్ఫ్ కోర్సు కూడా ఉంది.

7.jpg

ఈ భవంతిలోని ప్రధాన బెడ్ రూం వైశాల్యం ఏకంగా 4 వేల చదరపు అడుగులు. మనం సాధారణంగా చూసే ఇళ్లకంటే కూడా ఈ బెడ్‌రూమే పెద్దది.

2.jpg

2018లో ఈ భవంతి నిర్మాణం పూర్తైంది. దీన్ని కట్టేందుకు ఏకంగా 12 ఏళ్లు పట్టిందట. ఈ భవనం యజమాని అయిన స్థానిక రియల్ ఎస్టే్ట్ వ్యాపారి తాజాగా దీన్ని అమ్మకానికి పెట్టారు.

3.jpg

ఇటాలియన్ మార్బుల్‌తో ఈ భవనాన్ని నిర్మించారు. గోడలకు సుమారు 7 లక్షల బంగారం రేకులను తాపడం చేశారు.

4.jpg

భవంతిలో మొత్తం 5 బెడ్‌రూంలు, 19 బాత్రూమ్‌లు, 15 కార్లు పట్టేందుకు వీలుగా గరాజ్‌, లోపలా యటా స్విమ్మింగ్ పూల్స్, 70 వేల లీటర్ల నీరు పట్టే కోరల్ రీఫ్ అక్వేరియం ఉన్నాయి.

4.jpg

అంతేకాదు, భవంతి భారీగా ఉండటంతో విద్యుత్ సరఫరా కోసం అక్కడే ఓ చిన్న సబ్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర సందర్భాల కోసం ప్యానిక్ రూమ్స్ కూడా భవంతిలో ఉన్నాయి.

5.jpg

19, 20 శతాబ్దాలకు చెందిన పలు కళఖండాలను కూడా భవంతిలో ఏర్పాటు చేసి చూడటానికి ఇదో రాజభవనం అనిపించేలా తీర్చిదిద్దారు. మరి దీన్ని సొంతం చేసుకునే శ్రీమంతులు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

2.jpg

Updated Date - 2023-06-15T19:18:56+05:30 IST