World Hearing Day 2023: చెవులు సరిగా వినపడటం లేదా.. అయితే ఈ ఆరు విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నమాట..!
ABN , First Publish Date - 2023-03-03T13:32:29+05:30 IST
శాశ్వతంగా చవులు శబ్దాలను వినే స్థితిని కోల్పోతాయి.
కరోనా తరువాత, చాలా మందిలో వినికిడి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వినికిడి సమస్యకు మనం చేసుకుంటున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా లేకపోలేదు. అవేంటి అంటే, ఎక్కువ సౌండ్‌తో మాత్రమే టీవిని చూడటం, పాటలు వినడం వంటి పనులు చేయడం వల్ల ఆ ఒత్తిడి చవుల మీద పడుతుంది. అంతే కాకుండా ఇయర్‌బడ్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అది కర్ణభేరి దెబ్బతినేలా చేసి శాశ్వతంగా చవులు శబ్దాలను వినే స్థితిని కోల్పోతాయి. అయితే దీనికి మనం ఏంచేయాలనే విషయంగా పరిష్కారాలను వెతికే రోజు ఇది. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీని ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
ప్రపంచవ్యాప్త దినోత్సవం రోజున వినికిడి లోపం నివారణకు అవగాహన పెంచడం. కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం, వినికిడి సమస్యల ప్రమాదాన్ని తగ్గించగలుగుతాయి. ఈ సంవత్సరానికి సంబంధించిన అంశం "అందరికీ వినికిడి సంరక్షణ!"
వినికిడి లోపం ప్రమాదాన్ని తగ్గించడానికి చిట్కాలు
1. హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
గుండె జబ్బులు, అధిక రక్తపోటు రెండూ చెవి సున్నితమైన వినికిడి వ్యవస్థకు హాని కలిగిస్తాయి. పెద్ద శబ్దాలను వినడం, గట్టిగా మాట్లాడటం కూడా గుండెపోటు ఉన్న వ్యక్తులకు హాని కలిగిస్తుంది. అలాగే అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ఉన్నట్లయితే హృదయ అనారోగ్యం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. కనుక వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
2. ఇయర్ ప్లగ్స్ వాడండి.
ఫోమ్ ఇయర్‌ప్లగ్‌లు లేదా ఇయర్‌మఫ్‌లు ప్రత్యేకంగా శబ్దాన్ని మఫిల్ చేయడానికి తయారు చేయబడ్డాయి. ఇవి ఉపయోగించడానికి కూడా సులభమైనవి. రోజంతా శబ్దం స్థాయిలు స్థిరంగా ఉంటే వీటిని ఉపయోగించడం వల్ల వినికిడి లోపాన్ని నివారించవచ్చు. మరీ భారీ శబ్దకాలుష్యం ఎక్కువగా ఉంటే కనుక అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం మంచిది.
ఇది కూడా చదవండి: అరుదైన సంఘటనలో, US మహిళ 'MoMo' కవలలకు జన్మనిచ్చింది..!
3. నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌సెట్‌ని ఉపయోగించండి.
పెద్ద శబ్దాలను వినడానికి చవులు ఎప్పుడూ ఇబ్బంది పడతాయి. అయితే అటువంటి శబ్దాలను ఫిల్డర్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగించడం ద్వారా, నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్, హెడ్ఫోన్లు సంగీతం, సినిమాలు, ఫోన్ కాల్‌లను మరింత స్పష్టంగా వినడంలో ఇవి సహాయపడతాయి. తక్కువ వాల్యూమ్‌లో ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకరకంగా చెవులకు విశ్రాంతిని ఇచ్చిన వారు అవుతారు.
4. ధూమపానం మానేయండి.
సిగరెట్ పొగ వినికిడి ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అధిక ఆల్కహాల్ వినియోగంతో ఇలాంటి ప్రభావాలు కనిపిస్తాయి. ఇది చెవిని విషపూరితం చేస్తుంది. వాపింగ్, వినికిడి లోపంపై ఎక్కువ పరిశోధనలు లేనప్పటికీ, అలవాట్ల ద్వారా కూడా వినికిడి సమస్య వస్తుందనేది పరిశోధకుల మాట.
5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
వ్యాయామం చెవులకు, శరీరానికి అంతటా ప్రవహించే రక్తాన్ని నిర్వహిస్తుంది. చెవుల లోపలి భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేనా మంచి ప్రసరణతో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ రిలాక్స్ కావడం, యోగా, మెడిటేషన్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో వినికిడి సమస్యలు దరిచేరవు.
6. అవసరమైతే వైద్యుడిని కలవండి.
చెవి నొప్పి ఉంటే లేదా వినికిడి లోపం ఉందని ఆందోళన చెందుతుంటే కనుక వెంటనే వైద్యుని సలహా తీసుకోవాలి. వినికిడి లోపాన్ని ముందుగా గుర్తిస్తే కనుక చికిత్సలు మరింత విజయవంతమవుతాయి. చిన్న పిల్లల్లో ఇలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. చెవుల్లో చిన్న చిన్న వస్తువులు పెట్టుకోడం, పెద్దలకు గమనించకపోవడం వంటి పనులతో పిల్లల్లో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీపావళి సమయాల్లో, ఉత్సవాల్లో వినియోగించే బాణాసంచా వల్ల కూడా ఈ వినికిడి సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. పెద్ద శబ్దాలను విన్నప్పుడు ముఖ్యంగా వినికిడి సమస్యలు, ఇన్ఫెక్షన్ (Infection) బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమస్యలను గమనించినపుడు వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.