Viral Video: అబ్బా.. ఈ తాతకు ఎంత ఆనందమో.. యువతిని పెళ్లి చేసుకున్నాననే ఆనందంతో ఎలా నవ్వుతున్నాడో.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-05-21T14:31:11+05:30 IST
ప్రేమకు ఎలాంటి హద్దులూ ఉండవు. ప్రేమ పక్షులు కులం, మతం మొదలైన అన్ని అడ్డంకులను అధిగమించి ఏకమవుతాయి. అయితే తాజాగా ఒక్కటైన ప్రేమ జంట వయసును కూడా పట్టించుకోలేదు. ఓ యువతి దాదాపు తన తాత వయసున్న వ్యక్తిని వివాహం చేసుకుంది.
ప్రేమకు ఎలాంటి హద్దులూ ఉండవు. ప్రేమ పక్షులు కులం, మతం మొదలైన అన్ని అడ్డంకులను అధిగమించి ఏకమవుతాయి. అయితే తాజాగా ఒక్కటైన ప్రేమ జంట వయసును కూడా పట్టించుకోలేదు. ఓ యువతి దాదాపు తన తాత వయసున్న వ్యక్తిని వివాహం (Old man Marries Young girl) చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ వృద్ధుడు, ఓ యువతి ఒకే మంచంపై కూర్చుని ఉన్నారు.
వారిద్దరికీ అప్పుడే పెళ్లి జరిగినట్టు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఆ వీడియోలో వృద్ధుడు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. అతడి పక్కన వధువు గెటప్‌లో కూర్చున్న యువతి సిగ్గుపడుతూ ఉంది. ఈ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు. ఇది నిజమా? అని ఆశ్చర్యపోతున్నారు. rx_killer_boy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 4 లక్షల లైక్‌లు సంపాదించింది (Trending Video).
Viral Video: వామ్మో.. భారీ కొండచిలువతో ఆడుకుంటున్న బుడ్డోడు.. పేరెంట్స్‌పై నెటిజన్ల విమర్శలు!
ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వరుడు, వధువు మధ్య ఉన్న భారీ వయస్సు అంతరం గురించి చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది నిజమా? లేక వ్యూస్ కోసం నటిస్తున్నారా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇది ప్రేమ వివాహం కాదు.. డబ్బు కోసం తమ కూతురిని తల్లిదండ్రులు అమ్మేసి ఉంటారని మరొకరు కామెంట్ చేశారు.