Viral Video: ఈ ముసలావిడ డ్యాన్స్ అదుర్స్... హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
ABN , First Publish Date - 2023-05-30T16:25:51+05:30 IST
వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అని రుజువు చేశారు ఓ వృద్ధురాలు. ఆశా భోంస్లే పాడిన ‘‘పియా తూ అబ్ తో ఆజా’’ పాటకు ఆ వృద్ధ మహిళ రెట్టింపు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అని రుజువు చేశారు ఓ వృద్ధురాలు. ఆశా భోంస్లే పాడిన ‘‘పియా తూ అబ్ తో ఆజా’’ పాటకు ఆ వృద్ధ మహిళ రెట్టింపు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియా నెటిజన్ల మనుసును దోచుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మనీషా ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘హ్యాపీ మదర్స్‌డే మై మమ్మీ రాక్ మీ షాక్ ’’ అనే క్యాప్షన్ జతచేసింది. వీడియోలో వృద్ధ మహిళ 'పియా తు అబ్ తో ఆజా'కి స్టెప్పులేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ప్రముఖ నటుడు హెలెన్ డ్యాన్స్‌ను అనుకరిస్తూ పాటకు సునాయసనంగా,ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తన డ్యాన్స్ ద్వారా ఆ వృద్ధురాలు నిరూపించారని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
చిన్న పిల్లల్లా ఆమె ఉత్సాహంగా, హావభావాలతో ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి 1 మిలియన్ మంది యూజర్లు చూశారు.
ఆ వృద్ధురాలి డ్యాన్స్ చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. ‘‘నాకు మాటలు రావడం లేదు, ఈ బామ్మ ఎవరో గానీ, డ్యాన్స్ బాగా చేసింది. ఆమె డ్యాన్స్‌కు నా హ్యాట్సాఫ్’’ అని రాశాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తికి థాంక్స్ అని రాశాడు. "ఆమె చాలా కాలంగా ఈ క్షణం కోసం వేచి ఉన్నట్లు కనిపిస్తోంది." అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘యంగ్ హార్ట్.. బెటర్ దెన్ యంగస్టర్స్’’ అని మరో నెటిజన్ రాశాడు.