Elephant Video: బురద గుంటలో పడిన ఏనుగు.. పైకి రాలేక నరకయాతన.. చిమ్మచీకటిలో దాన్ని ఎలా కాపాడారంటే..!
ABN , First Publish Date - 2023-11-25T14:56:07+05:30 IST
అడవిలో కూడా ఏనుగులకు స్వేచ్ఛగా తిరిగే వీలుండదు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన లేదా వర్షాల వల్ల ఏర్పడిన గుంటలు ఏనుగుల పాలిట నరక కూపాలుగా మారుతుంటాయి. వాటిల్లో పడిన ఏనుగులు బయటకు రాలేక నరక యాతన పడుతుంటాయి. అటవీ అధికారులు చూసి కాపాడితే తప్ప అవి ప్రాణాలతో బయటపడలేవు.
అడవి (Forest)లో కూడా ఏనుగులకు (Elephant) స్వేచ్ఛగా తిరిగే వీలుండదు. వేటగాళ్లు ఏర్పాటు చేసిన లేదా వర్షాల వల్ల ఏర్పడిన గుంటలు ఏనుగుల పాలిట నరక కూపాలుగా మారుతుంటాయి. వాటిల్లో పడిన ఏనుగులు బయటకు రాలేక నరక యాతన పడుతుంటాయి. అటవీ అధికారులు (Forest Officials) చూసి కాపాడితే తప్ప అవి ప్రాణాలతో బయటపడలేవు. ఒక్కోసారి రోజుల తరబడి ఆ గుంటల్లోనే ఉండిపోయి ఆహారం లేక ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. తాజాగా తమిళనాడు (Tamilnadu)లో అలాంటి ఘటనే జరిగింది.
తాజాగా కోయంబత్తూరులోని మదుక్కరై ఫారెస్ట్ రేంజ్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు గుంటలో పడిపోయిన ఏనుగును గురువారం చూశారు. అధికారులు రాత్రి సమయంలో ఎంతో శ్రమించి దానిని బయటకు తీసి అడవిలోకి పంపించారు. కోయంబత్తూరు జిల్లాలోని అడవుల సరిహద్దు గ్రామాలలో ఏనుగుల సంచారం పెరిగింది. జనావాసాలలోకి వస్తున్న ఏనుగులు అనేక ప్రమాదాల బారిన పడుతున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు (Elephant Rescue Video).
Viral News: రూ.628 బిల్లు.. పొరపాటున రూ.6 లక్షలను చెల్లించిన యువతి.. వారం రోజుల తర్వాత గుర్తించినా..!
కోయంబత్తూరు అటవీ శాఖ అధికారులు ఏనుగును కాపాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 31 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఎంతో శ్రమించి ఏనుగును కాపాడారని అటవీ అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.