Expired Tablets: గడువు ముగిసిన టాబ్లెట్స్ ను పొరపాటున వేసుకుంటే జరిగేదేంటి..? కొద్ది నిమిషాల్లోనే..!
ABN , First Publish Date - 2023-06-05T12:57:23+05:30 IST
జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ఇంట్లో స్ట్రిప్స్ కొద్దీ టాబ్లెట్లు స్టాక్ ఉంటాయి. వీటని పొరపాటున..
ఇప్పటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం కంటే ఎక్కువగా మందుల మీద ఆధారపడుతున్నారు ప్రజలు. జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ఇంట్లో స్టాచెస్ కొద్దీ టాబ్లెట్లు స్టాక్ ఉంటాయి. వీటకి తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. డేట్ గమనించకోకుండా టాబ్లెట్స్ మింగేవారు కొందరైతే.. 'గడువు ముగిసి ఎక్కువ కాలం కాలేదులే.. పర్వాలేదు మింగచ్చు' అని వాటిని వాడేవారు మరికొందరు. అయితే ఇలా గడువు ముగిసిన మందులు వాడటం వల్ల జరిగేదేంటో తెలిసుకుంటే..
గడువు ముగిసిన మందులు(Expired Tablets) వాడటం ఆరోగ్యానికి హానికరం అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు ఈ మాటలను కొట్టిపడేస్తుంటారు. గడువు ముగిసిన టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఆ మందు పనిచేయదు, దానివల్ల సమస్య తగ్గదు. పైపెచ్చు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యను మరింత పెంచడమే కాదు, మూత్రపిండాలు(kidney), కాలేయంను(Liver) మీద స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థ(digest system) మీద ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక శక్తిని(immunity power) తగ్గించి అలెర్జీలను పెంచుతాయి(Increase allergy's). అందుకే మెడిసిన్ వాడేటప్పుడు ఖచ్చితంగా గడువు తేదీ చూసుకుని వాడాలి. అలాగే టాబ్లెట్స్ స్టాచెస్ మీద గడువు తేదీ కనిపించని పక్షంలో వాటిని దూరం పెట్టడమే ఉత్తమం.
గడువు ముగిసిన మందులను ఏం చేయాలంటే..
గడువు ముగిసిన టాబ్లెట్స్, సిరప్ లు ఇంట్లో ఉండనివ్వక పోవడం మంచిది. విటమిన్ టాబ్లెట్స్ అయితే వాటిని పొడిగా చేసి ఆ పొడిని ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలకు ఎరువుగా వాడచ్చు. లేకపోతే టాబ్లెట్స్ పౌడర్ ను నీటిలో కలిపి మొక్కలకు పోయవచ్చు. అలా లేని పక్షంలో టాబ్లెట్స్ ను పౌడర్ చేసి నీళ్ళలో కలిపి సింక్ లో పారబోయాలి. సిరప్ లు, ఇతర మందులను ఇలాగే చేయాలి. టాబ్లెట్స్ ను బిళ్ళలుగా అలాగే ఎప్పుడూ పడేయకూడదు. అదే విధంగా పెద్దలను చూసి టాబ్లెట్లు వేసుకునే అలవాటు పిల్లలలో ఉంటుంది. అందుకే గడువు ముగిసిన టాబ్లెట్లు ఇంట్లో ఉండనివ్వకపోవడం ఉత్తమం.