Factcheck: అర్ధరాత్రి అనంతపురంలో కలకలం.. వైరల్ వీడియో.. జనాల్లో టెన్షన్.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..

ABN , First Publish Date - 2023-04-21T17:17:20+05:30 IST

అనంతపురంలో కలకలం రేపిన వీడియో వెనకున్న అసలు నిజం ఇదే..

 Factcheck: అర్ధరాత్రి అనంతపురంలో కలకలం.. వైరల్ వీడియో.. జనాల్లో టెన్షన్..  అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అది రాత్రి సమయం.. హైవేపై అప్పుడప్పుడు వాహనాలు వెళుతున్నాయి. అదే రూట్‌లో వెళుతోందో కారు. ఇంతలో డ్రైవర్‌కు రోడ్డుపై ఓ జంతువు కనిపించింది . దాన్ని చూడగానే అతడికి అనుమానం వచ్చింది. దీంతో.. ముందు జాగ్రత్తగా కారు ఆపేశాడు. చివరకు డ్రైవర్ అనుకున్నదే నిజమైంది. కారు లైటు వెలుతురులో స్పష్టంగా కనిపించిందా చిరుత. చాలా తీరిగ్గా కూర్చుంది(Leopard on Highway). కారును చూసి కూడా భయపడినట్టు లేదు. అంతే.. ఆ తరువాత క్షణాల్లో ఈ వార్త వైరల్ అయిపోయింది(Viral).

ఈ చిరుత వీడియోతో అనంతపురంలో(Anantapur) కలకలం మొదలైంది. రాయదుర్గం నియోజకవర్గం, డీ.హీరేహాళ్ మండలం, ఓబులాపురం గ్రామం బెంగళూరు-బళ్లారి హైవే చెక్ పోస్ట్‌పై మంగళవారం రాత్రి చిరుత తిరుగుతోందన్న వార్త స్థానికుల్లో కలవరం కలిగించింది. వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు చిరుత ఆ పరిసరాల్లోనే తిరిగిందంటూ స్థానికులు కథలుకథలుగా చెప్పుకున్నారు.

1.jpg

అప్పటికే మీడియా దృష్టికి ఇది రావడంతో ఫ్యాక్ట్ చెకింగ్‌(Fact checking) ప్రారంభమైంది. గూగుల్‌తో పాటూ సోషల్ మీడియాలో కూడా వెతగ్గా ఈ వీడియో వెనుక నిజానిజాలు బయటకు వచ్చేశాయి. పులి నిజమే.. రోడ్డుపై బైఠాయించడం కూడా వాస్తవమే. కానీ ఘటనాస్థలం మాత్రం తప్పు. కర్ణాటకలోని గడగ జిల్లా బింకడకట్టి గ్రామం పక్కన ఉన్న రహదారిపై ఈ ఘటన జరిగింది. అది కూడా ఏప్రిల్ 17న. అయితే.. ఈ వీడియో తొలుత బెంగళూరులోనూ సంచలనం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై చిరుత తిరుగుతోందన్న వార్తతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడ పరిస్థితి సద్దుమణిగాక అనంతపురంలో హడావుడి మొదలైంది. ఫ్యాక్ట్ చెకింగ్‌తో నిజానిజాలన్నీ వెలుగులోకి వచ్చేశాయి.

Updated Date - 2023-04-21T17:31:04+05:30 IST