CCTV Footage: రోడ్లపై జాగ్రత్త.. మరీ ముఖ్యంగా పిల్లలను ఎక్కించుకుని వెళ్లేటప్పుడు..!
ABN , First Publish Date - 2023-08-26T17:03:58+05:30 IST
సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మెయిన్ రోడ్‌పై కారు వేగంగా దూసుకొస్తోంది. పక్క వీధిలో నుంచి ఒక వ్యక్తి తన కూతురిని (చిన్నారి) స్కూటీపై ఎక్కించుకుని మెయిన్ రోడ్‌పైకి వస్తుండగా వేగంగా వచ్చిన ఆ కారు తండ్రీకూతురు వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఎంతో నెట్‌వర్క్ ఉండే మీడియాలో కూడా దొరకని వార్తలు, వీడియోలు, వింతలు, విశేషాలు, విషాదాలు.. ఇలా అన్నీ ఒకేచోట దొరికేస్తున్నాయి. ఎక్స్(ట్విటర్), ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్.. ఇలా ఏదో ఒక సామాజిక మాధ్యమంలో ఎలక్ట్రానిక్ మీడియా కంటే ముందుగానే కొన్ని వీడియోలు, వార్తలు ఈ మధ్య కంటపడుతున్నాయి. అలా తాజాగా సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆదర్శ్ నగర్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ వీడియోలో ఏముందంటే.. ఒక మెయిన్ రోడ్‌పై కారు వేగంగా దూసుకొస్తోంది. పక్క వీధిలో నుంచి ఒక వ్యక్తి తన కూతురిని (చిన్నారి) స్కూటీపై ఎక్కించుకుని మెయిన్ రోడ్‌పైకి వస్తుండగా వేగంగా వచ్చిన ఆ కారు తండ్రీకూతురు వస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆ పాప స్కూటీ పక్కనే పడిపోగా, స్కూటీ నడుపుతున్న ఆమె తండ్రి కారు టాప్‌పై పడటంతో కొంత దూరం దూసుకెళ్లాక కిందపడిపోయాడు. కారు ఆపినట్టే ఆపి మళ్లీ అక్కడున్న స్థానికులను గమనించిన కారు నడుపుతున్న వ్యక్తి కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు. హుటాహుటిన ఆ చిన్నారిని, ఆమె తండ్రిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడం బాధిత కుటుంబానికి కొంత ఊరట కలిగించే విషయం. దేశ రాజధాని నగరంలో ఇటీవల హిట్ అండ్ రన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
హైదరాబాద్‌లో కూడా గత మేలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో ఓ హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. స్విఫ్ట్ డిజైర్ కారు (Swift DZire Car TS15EZ0795) ఓ బాలుడిని ఢీ కొట్టింది. కారు నడిపింది సూడాన్ దేశస్తుడు. అనంతరం కారుతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు కారును పట్టుకున్నారు. కోపోద్రిక్తులైన వారు కారును ధ్వంసం చేశారు.