భార్యపై కోపాన్ని 15 నెలల కూతురిపై చూపించాడు.. పసికందును గోడకేసి కొట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-03-26T20:23:34+05:30 IST

ఆ వ్యక్తికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఏడాదిన్నర క్రితం ఓ పాప జన్మించింది.. ఇటీవల అతనికి తన భార్యతో విభేదాలు తలెత్తాయి..

భార్యపై కోపాన్ని 15 నెలల కూతురిపై చూపించాడు.. పసికందును గోడకేసి కొట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆ వ్యక్తికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఏడాదిన్నర క్రితం ఓ పాప జన్మించింది.. ఇటీవల అతనికి తన భార్యతో విభేదాలు తలెత్తాయి.. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భార్య తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త ఎన్నిసార్లు పిలిచినా తిరిగా రాలేదు.. దీంతో ఆమెను తీసుకెళ్లడానికి నేరుగా పుట్టింటికి వెళ్లాడు.. భర్త ఎంత బతిమలాడినా అతడితో కలిసి వెళ్లేందుకు ఆ మహిళ నిరాకరించింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త 15 నెలల కూతురిని తీసుకుని గోడకేసి కొట్టాడు.. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది (Crime News).

రాజస్థాన్‌లోని (Rajasthan) ఝుంఝును జిల్లా గంగూర్ గ్రామానికి చెందిన జీవన్, భారతిలకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 15 నెలల క్రితం ఓజస్వి అనే బాలిక జన్మించింది. కాగా, భర్త రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి కొడుతుండడాన్ని భారతి తట్టుకోలేకపోయింది. భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ ఘర్షణ జరిగేది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భారతి తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఎన్నిసార్లు అడిగినా తిరిగి రాలేదు.

తన భార్య, బిడ్డను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు జీవన్ శనివారం సాయంత్రం వెళ్లాడు. అయితే భర్త ఎంత బతిమలాడినా జీవన్‌తో వెళ్లేందుకు భారతి అంగీకరించలేదు. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన జీవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మంచంపై ఉన్న 15 నెలల పాపను ఎత్తి గోడకేసి కొట్టాడు (Father killed daughter). దీంతో ఆ పాప అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Snake bite: పాము కాటేసినా పరీక్ష రాస్తానని పట్టుబట్టిన బాలిక.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

Updated Date - 2023-03-26T20:23:34+05:30 IST