Wife: భర్త మొదటి భార్య దెయ్యమై వచ్చి వేధిస్తోందట.. భరించలేక పెళ్లయిన 6 నెలలకే రెండో భార్య ఏం చేసిందంటే..!

ABN , First Publish Date - 2023-08-04T16:55:33+05:30 IST

ఆ మహిళ వివాహిత, ఇద్దరు పిల్లలకు తల్లి. ఏడాది క్రితం తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆరు నెలల క్రితం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తికి ఇద్దరు పిల్లలు. భార్య ఓ ప్రమాదంలో చనిపోయింది. ఆ మహిళ తన పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలేసి రెండో భర్తతో కలిసి ఉంటోంది.

Wife: భర్త మొదటి భార్య దెయ్యమై వచ్చి వేధిస్తోందట.. భరించలేక పెళ్లయిన 6 నెలలకే రెండో భార్య ఏం చేసిందంటే..!

ఆ మహిళ వివాహిత, ఇద్దరు పిల్లలకు తల్లి. ఏడాది క్రితం తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆరు నెలల క్రితం మరో వ్యక్తిని వివాహం (Second Marriage) చేసుకుంది. ఆ వ్యక్తికి ఇద్దరు పిల్లలు. భార్య ఓ ప్రమాదంలో చనిపోయింది. ఆ మహిళ తన పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలేసి రెండో భర్తతో కలిసి ఉంటోంది. అయితే తన భర్త మొదటి భార్య ఆత్మ (Spirit) రూపంలో వచ్చి తనను వేధిస్తోందని ఆమె కొన్ని రోజులుగా చెబుతోంది. చివరకు ఆమె విషం (Poison) తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

రాజ్‌కోట్‌ (Rajkot)కు చెందిన జల్పా బగ్తారియా అనే 40 ఏళ్ల మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి ఆరు నెలల క్రితం లక్ష్మణ్ కోలె అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన లక్ష్మణ్ మొదటి భార్య చనిపోయింది. దాంతో రెండో వివాహం చేసుకున్నాడు. తన పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలేసిన జల్ఫా భర్తతో కలిసి ఉంటోంది. అయితే తన భర్త మొదటి భార్య ఆత్మ రూపంలో వచ్చి తనను వేధిస్తోందని జల్ఫా మూడు నెలల క్రితం తన తండ్రికి ఫోన్ చేసింది. తన భర్త మొదటి భార్య ఫొటోను ఇంట్లో పెట్టి రోజూ పూజలు చేస్తున్నాడని, అప్పుడప్పుడు ఆమె ఆత్మ తన భర్తలోకి ప్రవేశిస్తోందని మూడు నెలల క్రితం తండ్రికి చెప్పింది.

Snake vs Cow: పొలంలో తిరుగుతున్న ఆవుకు ఎదురుపడిందో పాము.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!

మొదటి భార్య ఆత్మ ప్రవేశించినపుడు భర్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, తనను విపరీతంగా కొడుతున్నాడని తండ్రికి చెప్పింది. దీంతో జల్ఫా తండ్రి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి తాయెత్తు కట్టించుకోవాలని చెప్పాడు. అయినా లక్ష్మణ్ పట్టించుకోకపోవడంతో జల్ఫా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెకు తల్లిదండ్రులు నచ్చచెప్పి తిరిగి భర్త దగ్గరకు పంపించారు. గత నెల 28వ తేదీన జల్ఫా తన సోదరికి ఫోన్ చేసి తన పిల్లలను బాగా చూసుకోవాలని చెప్పింది. అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. జల్ఫా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

Updated Date - 2023-08-04T16:55:33+05:30 IST