ట్రైన్ జర్నీలో ఐదుగురు కుర్రాళ్ల తింగరి పని.. పరుగులు తీసిన పోలీసులు.. ప్రయాణీకులంతా టెన్షన్ టెన్షన్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-21T17:12:03+05:30 IST

నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటాడొక రచయిత. అయితే సరిగ్గా ప్రయాణించాల్సిన ట్రైన్ ఎక్కి అయిదుగురు కుర్రాళ్ళు చేసిన తింగరి పని

ట్రైన్ జర్నీలో ఐదుగురు కుర్రాళ్ల తింగరి పని.. పరుగులు తీసిన పోలీసులు.. ప్రయాణీకులంతా టెన్షన్ టెన్షన్.. అసలేం జరిగిందంటే..

నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటాడొక రచయిత. అయితే సరిగ్గా ప్రయాణించాల్సిన ట్రైన్ ఎక్కి అయిదుగురు కుర్రాళ్ళు చేసిన తింగరి పని ప్రయాణీకులను భయాందోళనలోకి నెట్టింది, రైల్వే సిబ్బందిని పరుగులు పెట్టించింది. ట్రైన్ గమ్యస్థానానికి చేరాల్సిన సమయం కంటే చాలా ఆలస్యంగా చేరేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీ లో హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి చెన్నై వెళుతున్న 12612 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందనే సమాచారం రైల్వే సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించింది. రైల్వే సిబ్బంది బాంబ్ కోసం పలు స్టేషన్లలో ట్రైన్ ను అని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. వారు ఎంత వెతికినా అనుమానించాల్సిన వస్తువులు ఎక్కడా దొరకలేదు. దీంతో విసిగిపోయిన పోలిసులు బాంబ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరని ఆరా తీశారు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో G3 కోచ్ లో సీట్ నెంబర్ 48లో ప్రయాణిస్తున్న తన్మయ్ పటేల్ అనే కుర్రాడు రైల్వే వారికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

read also: కొత్తగా పెళ్లయిందా..? ఈ 5 అంశాల్లో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు తప్పవు.. విడిపోవడం ఖాయం..!


తన్మయ్ పటేల్ ను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులు అతన్ని పట్టుకుని ట్రైన్ లో బాంబ్ ఉందని నీకెవరు చెప్పారంటూ నిలదీశారు. దీంతో తన్మయ్ పటేల్ G2 కోచ్ లో ఐదుగురు కుర్రాళ్ళు ఉన్నారని, వాళ్ళు మాట్లాడుకుంటుంటే తాను విన్నానని చెప్పాడు. ప్రమాదం తప్పించాలనే ఆలోచనతో రైల్వే వారికి సమాచారం అందించానని అన్నాడు. పోలీసులు G2 కోచ్ లోకి వెళ్లి ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నారు. వీళ్ళు చేసిన పనితో ట్రైన్ సాయంత్రం 6.45 నుండి మూడు గంటల పాటు నిలిపెయ్యాల్సి వచ్చింది.

కాగా తన్మయ్ పటేల్ లక్నోకు చెందినవాడని తెలిసింది. అతను డెంటల్ కోర్స్ చేసి బెంగళూరులో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళుతూ ఈ సమస్యలో చిక్కుకుపోయాడు. పోలీసులు ఆరుమందిని ఆగ్రా జీఆర్పీ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2023-02-21T17:12:15+05:30 IST