Men vs Woman: మగాళ్లే ఎందుకు ముందుగా ప్రపోజ్ చేస్తారు..? అమ్మాయిలు త్వరగా బయటపడకపోవడం వెనుక 5 కారణాలు..!
ABN , First Publish Date - 2023-08-26T14:57:29+05:30 IST
ఒక అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయి కోసం పిచ్చిగా ప్రయత్నిస్తే, అతన్ని రొమాంటిక్ అంటారు. కానీ
ఇప్పటి రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో అబ్బాయిలతో భుజం భుజం కలిపి నడుస్తున్నారు. తన సమాన హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్నారు కూడా. ప్రేమను మొదట వ్యక్తీకరించే విషయమే తీసుకోండి. మగవారు చాలా విషయాల్లో వెనకున్నా, మనసుకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఆడవారి కన్నా ముందే ఉన్నారు. ఇందులో అమ్మాయిలను పూర్తిగా తప్పు పట్టలేకపోయినా, ప్రపోజ్ చేసే బాధ్యత మాత్రం అబ్బాయిలే తీసుకోని ప్రేమను వ్యక్తీకరించే పని మొదలుపెట్టారు.
కావాలి అనుకోవాలి..
అనేక అధ్యయనాల డేటా ప్రకారం.. కూడా పురుషుల కంటే స్త్రీలు డేట్‌లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ప్రేమ విషయంలో మాత్రం ఇంకా వెనుకే ఉన్నారు. ఒక్కోసారి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్త్రీలు ప్రేమను చెబితే ఎక్కడ చులకన చేస్తారో అనే కోణం నుంచి ఆలోచిస్తూ ఉంటారు.
తిరస్కరణను ఎదుర్కోవాలనే భయం...
ప్రేమలో తిరస్కరణకు గురైనందుకు ఎవరు భయపడరు. కానీ అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లోకి తమను తాము పెట్టుకునేందుకు ఇష్టం చూపించరు.
ఇదికూడా చదవండి: నెలసరి రాలేదని ప్రగ్నెన్సీ టెస్ట్ చేస్తే పదే పదే నెగిటివ్ వస్తోందా..? డాక్టర్లు చెబుతున్న అసలు కారణాలేంటంటే..!
భయం
అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి ముందుకు రారు, ఎందుకంటే అబ్బాయి ఎక్కడ అగౌరవంగా మాట్లాడతాడనే భయం, ప్రతిసారీ బెదిరిస్తానే ఆలోచనే దీనికి కారణం. నాకు ప్రపోజ్ చేసింది నువ్వే, నేను నీ దగ్గరకు రాలేదు.. ఇవన్నీ ఆలోచిస్తూనే అమ్మాయిలు ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకసారి ప్రేమలో పడితే, తమ బంధంలో ఎప్పుడూ తలవంచాల్సిందేనని ఆడవారు భావిస్తారు.
బోల్డ్ అనే ట్యాగ్
తమకు నచ్చిన అబ్బాయికి ప్రపోజ్ చేయడానికి వెనుకాడుతున్నారంటే, సమాజం బోల్డ్ అనే ముద్ర వేస్తుందనే భయంతో, తన మనసులో అబ్బాయి పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టే సాహసం చేయదు. తన హావభావాలతో వ్యక్తపరిచేందుకు మాత్రమే చూస్తుంది.
నిరాశగా అనిపిస్తుంది.
శతాబ్దాలుగా అబ్బాయిలు మాత్రమే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఒక అబ్బాయి తనకు ఇష్టమైన అమ్మాయి కోసం పిచ్చిగా ప్రయత్నిస్తే, అతన్ని రొమాంటిక్ అంటారు. కానీ అమ్మాయిలు ఇలాంటివి చేస్తే వారిని డెస్పరేట్ అంటారు. అంతే కాదు క్యారెక్టర్ ని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇవన్నీ ఆలోచిస్తూ అమ్మాయిలు తమ మనసులో మాటలను బయటపెట్టేందుకు కాస్త జంకుతున్నారు. మనసులో ఉన్న భావాలను లోలోపలే దాచేసుకుంటున్నారు.