Viral: చెన్నై వాసుల్లో కొత్త భయం.. గాల్లో ఎగురుతూ కనిపించిన నాలుగు వింత ఆకారాలు.. ఏలియన్స్ వచ్చారంటూ..!
ABN , First Publish Date - 2023-08-02T15:59:13+05:30 IST
గ్రహాంతర వాసుల గురించిన వార్తలు ఎన్నో దశాబ్దాలుగా వింటున్నాం. వేరే గ్రహాలపై జీవులు ఉన్నాయో, లేవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే అవేవీ నిర్దిష్టమైన సమాచారాన్ని మాత్రం అందించలేదు. గ్రహాంతర వాసుల గురించి ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చాయి.
గ్రహాంతర వాసుల (Aliens) గురించిన వార్తలు ఎన్నో దశాబ్దాలుగా వింటున్నాం. వేరే గ్రహాలపై జీవులు ఉన్నాయో, లేవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే అవేవీ నిర్దిష్టమైన సమాచారాన్ని మాత్రం అందించలేదు. గ్రహాంతర వాసుల గురించి ఎన్నో హాలీవుడ్ సినిమాలు (Hollywood Movies) వచ్చాయి. భూమిపైకి గ్రహాంతర వాసులు వచ్చారనే వార్తలు కూడా చాలాసార్లు వచ్చాయి. అయితే వాస్తవంగా మాత్రం వాటి ఉనికి ప్రశ్నార్థకమే. తాజాగా చెన్నై (Chennai) బీచ్‌కు సమీపంలో తీసిన ఫొటో చర్చనీయాంశంగా మారింది.
చెన్నై సమీపంలో ఉన్న బీచ్ గగనతలంలో నాలుగు వింత ఆకారాలు ఎగురుతూ కనిపించాయి. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ (Viral Photo)గా మారింది. అవి డ్రోన్‌లు (Drones) అని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం అవి గ్రహాంతర వాసులని చెబుతున్నారు. జూలై 26వ తేదీ సాయంత్రం, చెన్నై సమీపంలోని ముట్టుగాడు (Muttugadu) సముద్ర తీరంలోని ఆకాశంలో నాలుగు వింత వస్తువులు ఎగురుతూ కనిపించాయి. రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ ఫిలిప్ తన మొబైల్ ఫోన్ నుంచి వాటిని చిత్రీకరించారు. కొంతమంది వీటిని ఫ్లయింగ్ సాసర్లు (Flying Saucer) అంటున్నారు.
Zomato CEO Weight Loss: మారిపోయిన జొమాటో సీఈవో లుక్.. ఏకంగా 15 కేజీల బరువు ఎలా తగ్గాడో చెప్పేశారుగా..!
ఫ్లయింగ్ సాసర్ అంటే గ్రహాంతర వాసులు ప్రయాణించే విమానాలు. చెన్నై బీచ్‌లో కనిపించినవి అవేనని చాలా మంది నమ్ముతున్నారు. అసలు అవి ఏంటి?, నిజంగా ఫ్లయింగ్ సాసర్లు అయితే అందులో ఎవరు ప్రయాణించారు? వంటి విషయాలపై పరిశోధన జరిగాలని ప్రదీప్ కోరుతున్నారు. ఏదేమైనా ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.