August Month New Rules: ఆగస్టులో 3 కొత్త రూల్స్.. ఐసీఐసీఐ అకౌంట్ ఉన్నవాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-07-29T17:29:03+05:30 IST
జూలై నెల ముగియడానికి మరో రెండు రోజుల సమయం ఉంది. ఆగస్టు నెల రాబోతోంది. ఆగస్టు నెల నుంచి ఆర్థిక సంబంధ విషయాల్లో మూడు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్, ఐసీఐసీఐ అకౌంట్ సర్వీస్ ఛార్జీలు, నాచ్ సేవలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
జూలై (July) నెల ముగియడానికి మరో రెండు రోజుల సమయం ఉంది. ఆగస్టు (August) నెల రాబోతోంది. ఆగస్టు నెల నుంచి ఆర్థిక సంబంధ విషయాల్లో మూడు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing), ఐసీఐసీఐ అకౌంట్ (ICICI bank) సర్వీస్ ఛార్జీలు, నాచ్ (NACH) సేవలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక, ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉంటాయి. వచ్చే నెల నుంచి జరిగే మార్పులపై ఓ లుక్కేయండి (August Month New Rules)..
ఐటీఆర్ ఫైలింగ్..
ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్స్‌తోపాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి ఐటీఆర్ ఫైల్ చేస్తే చెల్లింపుదారులు రూ.5 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీని పొడిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు స్పష్టమవుతోంది.
Seema Haider: అసలు ఇతడిలో ఏం చూసి ఇష్టపడ్డావమ్మా అని సీమా హైదర్‌ను ఆమె స్నేహితులు అడిగితే..!
వారంలో అన్ని రోజులూ NACH సేవలు..
నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH సేవలకు సంబంధించి ఆగస్టు 1 నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సేవలు ఇకపై వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉండనున్నాయి. ఎన్‌ఏసీహెచ్ అనేది బల్క్ పేమెంట్ సిస్టమ్. సెలవు రోజుల్లో ఈ పద్ధతి ద్వారా చెల్లింపులు సాధ్యం కాదు. వారంలో అన్ని రోజులూ NACH సేవలను అందుబాటులో ఉంచడం వల్ల సెలవు రోజు అయినా కూడా ఉద్యోగులకు వేతనాలు వచ్చేస్తాయి.
ఐసీఐసీఐ బ్యాంకు సర్వీస్ ఛార్జీల పెంపు..
ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి ప్రత్యేక అలెర్ట్. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు నిర్వహించే లావాదేవీలకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1వ తేదీ నుంచి పెరగబోతున్నాయి. హోమ్ బ్రాంచ్‌లో నెలకు రూ. రెండు లక్షల వరకు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్ డ్రాయల్స్) పూర్తిగా ఉచితం. రెండు లక్షలు దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ.5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నాన్-హోమ్ బ్రాంచ్‌లో అయితే రోజుకు రూ.25 వేల వరకు నగదు లావాదేవీలు ఉచితం. ఆ పరిమితి దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ.5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.