Financial Rules: ముచువల్ ఫండ్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ వరకు.. అక్టోబర్ 1 నుంచి 6 కొత్త రూల్స్..!
ABN , First Publish Date - 2023-09-24T11:08:15+05:30 IST
మరో వారం రోజుల్లో అక్టోబర్ నెల మొదలు కాబోతోంది. ఈ నెల 30వ తేదీతో ఆర్థిక పరమైన విషయాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీ మ్యాట్ ఖాతాలు,సేవింగ్స్ ఆకౌంట్స్, రూ.2000 నోట్ల మార్పిడి వంటి చాలా అంశాల్లో సెప్టెంబర్ 30వ తేదీ డెడ్‌లైన్‌గా ఉంది.
మరో వారం రోజుల్లో అక్టోబర్ నెల మొదలు కాబోతోంది. ఈ నెల 30వ తేదీతో ఆర్థిక పరమైన విషయాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీ మ్యాట్ ఖాతాలు,సేవింగ్స్ ఆకౌంట్స్, రూ.2000 నోట్ల మార్పిడి వంటి చాలా అంశాల్లో సెప్టెంబర్ 30వ తేదీ డెడ్‌లైన్‌గా ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. అలాగే అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో అక్టోబర్ 1వ (Ocotober 1st) తేదీ నుంచి ట్యాక్స్ 20 శాతానికి పెరగనుంది (Financial Rules).
మ్యూచువల్ ఫండ్స్ (Mutual fund): మ్యూచువల్ ఫండ్స్ కడుతున్న వారు ఈ నెల 30వ తేదీలోపు నామినీ (Nominee) పేర్లను జత చేయాలి. అక్టోబర్ 1వ తేదీ నుంచి నామినీ పేర్లను జత చేయడం కుదరదు. ఇప్పటికే మార్చి 31తో ఈ గడువు ముగిసినప్పటికే సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించారు. ఈ నెల 30వ తేదీ లోపు కచ్చితంగా నామినీ పేరు జత చేయాలి లేదా తమకు నామినీ అవసరం లేదని డిక్లరేషన్ సమర్పించాలి. లేకపోతే ఆ ఫోలియోలు ఫ్రీజ్ అయిపోతాయి. అందువల్ల ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, దానిపై వచ్చే రాబడిని తిరిగి పొందడం కష్టమవుతుంది.
డీ మ్యాట్ ఖాతాలు, ట్రేడింగ్ ఖాతాలు (Demat Accounts): స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారు కూడా తమ డీ మ్యాట్ ఖాతాలకు నామినీ (Update Nominee) పేర్లను ఈ నెల 30వ తేదీ లోపు జత చేయాలి. గడువు తర్వాత అప్‌డేట్ చేయడానికి వీలుండదు. సెబీ సర్క్యులర్ ప్రకారం ఈ గడువు తేదీ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది.
రూ.2 వేల నోట్ల మార్పిడి (Exchanging Rs 2000 notes): కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ఈ నెల 30వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. ఇప్పటికీ రూ.2 వేల నోట్లను కలిగి ఉన్న వారు ఈ నెలాఖరు లోపు కచ్చితంగా మార్చుకోవాలి.
Viral Video: వేగంగా దూసుకొస్తున్న రైలు.. అయినా రైల్వే ట్రాక్ దాటిన కారు.. అక్కడితో ఆగకుండా ఆ డ్రైవర్ ఏం చేశాడంటే..!
అంతర్జాతీయ చెల్లింపులపై ట్యాక్స్ (TCS rules): అంతర్జాతీయ చెల్లింపులపై కేంద్రం విధించే టీసీఎస్ పన్ను (TCS Tax) ప్రస్తుతం 5 శాతం వరకు ఉంది. అది వచ్చే నెల 1వ తేదీ నుంచి 20 శాతం కాబోతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మంచి ఖర్చు చేసిన వారు తమ మూల ధనంలో 20 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులకు మాత్రం పాత పద్ధతిలోనే పన్ను వసూలు చేస్తారు. రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు, విదేశీయులక పంపే బహుమతులు వంటి వాటికి ఖర్చు చేసే వారిపై ఈ ట్యాక్స్ పడనుంది.
సేవింగ్స్ అకౌంట్ (Savings Account): అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని స్మాల్ సేవింగ్స్ ఖాతాలకు ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పని సరి కానుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉన్న వారు ఈ నెలాఖరు లోపు కచ్చితంగా తమ ఆధార్ కార్డును సమర్పించాలి. లేకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ఖాతాలు స్తంభించిపోతాయి.