Share News

Viral: ఈ ట్యాగ్ లైన్స్ చూస్తే నవ్వుకోవాల్సిందే.. కార్ల యాజమానుల క్రియేటివిటీపై నెటిజన్లు ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-11-19T15:39:12+05:30 IST

పెద్ద పెద్ద ట్రక్కుల వెనకాల, కార్ల వెనుక వైపు రాసే నినాదాలు బాగా ఆకట్టుకుంటాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లేదా వాహనంలో వెళుతున్నపుడు ట్రక్కుల వెనుక వైపు రాసి ఉన్న ఫన్నీ ట్యాగ్‌లైన్స్‌ ఆకట్టుకుంటుంటాయి. వాటిని చూసిన వెంటనే నవ్వు వస్తుంటుంది.

Viral: ఈ ట్యాగ్ లైన్స్ చూస్తే నవ్వుకోవాల్సిందే.. కార్ల యాజమానుల క్రియేటివిటీపై నెటిజన్లు ప్రశంసలు!

పెద్ద పెద్ద ట్రక్కుల (Trucks) వెనకాల, కార్ల వెనుక వైపు రాసే నినాదాలు (Quotations) బాగా ఆకట్టుకుంటాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లేదా వాహనంలో వెళుతున్నపుడు ట్రక్కుల వెనుక వైపు రాసి ఉన్న ఫన్నీ ట్యాగ్‌లైన్స్‌ (Funny Taglines) ఆకట్టుకుంటుంటాయి. వాటిని చూసిన వెంటనే నవ్వు వస్తుంటుంది. ప్రస్తుతం చాలా మంది కార్ల యజమానులు తమ కార్ల పేరుతో వర్డ్ ప్లే చేసి ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఫొటోలు రెండు సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral) అవుతున్నాయి.

తాజాగా హ్యుండాయ్ వెర్నా (Verna) కారు వెనుక రాసిన ఓ పదం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ``వెర్నా`` పక్కన హిందీలో ``క్యా`` అని రాశారు. ``వెర్నా క్యా`` అంటే లేకపోతే ఏం జరుగుతుంది అని అర్థం వచ్చేలా వర్డ్ ప్లే చేశాడు. అలాగే ఓ వ్యక్తి తన ``కియా`` కారు లోగో ముందు మైనే ప్యార్' అని రాశాడు. దాంతో అది ``మైనే ప్యార్ కియా``గా మారిపోయింది. అలాగే ఓ వ్యక్తి తన ఆటో వెనకాల ప్రేమ గురించి ఓ ఫన్నీ కొటేషన్ రాశాడు. ``ప్రేమ అనేది పార్క్‌లో నడవడం లాంటిది.. జురాసిక్ పార్క్‌లో`` అంటూ రాసిన కొటేషన్ చాలా మందిని నవ్విస్తోంది.

అలాగే మరో వ్యక్తి తన ఆటో వెనకాల ``పదే పదే హారన్ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది`` అంటూ కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. A- ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చగా మారుతుంది. B- రహదారి వెడల్పు అవుతుంది. సి- కారు ఎగరడం ప్రారంభిస్తుంది, D- ఏమీ జరగదు అంటూ అప్షన్లు ఇచ్చారు. ఇలాంటి ఫొటోలు, ఫన్సీ క్యాప్షన్లు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - 2023-11-19T15:39:14+05:30 IST