Anaconda Devouring Capybara: వందేళ్ల నాటి ఈ అనకొండ స్వరూపం పాడవుతుండటంతో..

ABN , First Publish Date - 2023-07-06T19:03:03+05:30 IST

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్‌కెన్‌బర్గ్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కాపిబారాను మ్రింగేస్తున్న అనకొండ అత్యంత ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటి. ఇది వందేళ్లుగా పిల్లలనుంచి పెద్దల వరకు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Anaconda Devouring Capybara: వందేళ్ల నాటి ఈ అనకొండ స్వరూపం పాడవుతుండటంతో..

జర్మనీ(Germany)లోని ఫ్రాంక్‌ఫర్ట్‌(Frankfurt)లోని సెన్‌కెన్‌బర్గ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం(Senckenberg Natural History Museum)లో కాపిబారా(Capybara)ను మ్రింగేస్తున్న అనకొండ(An Anaconda) స్వరూపం అత్యంత ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటి. ఇది వందేళ్లుగా పిల్లలనుంచి పెద్దల వరకు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Ankonda-01.jpg

ఈ అద్భుత ప్రదర్శన ఇకపై మ్యూజియంలో సందర్శకులకు కనిపించదు. ఎందుకంటే అధ్యయనం, పునరుద్ధరణలో భాగంగా దీనిని ల్యాబ్‌కు తరలించారు మ్యూజియం నిర్వాహకులు.

WhatsApp Image 2023-07-06 at 6.47.51 PM.jpeg

వందేళ్ళ నాటి పురాతన ప్రసిద్ధ ప్రదర్శనలో వాతావరణంలో మార్పుల కారణంగా అనకొండ చర్మం, లోపలి భాగాలు ప్రభావితం అవుతుండటంతో దీనికి మేక్ ఓవర్ చేయాల్సి వస్తుందని టాక్సీడెర్మిస్ట్‌లు అంటున్నారు.

WhatsApp Image 2023-07-06 at 6.47.51 PM (2).jpeg

మ్యూజియం డైరెక్టర్ బ్రిగిట్టే ఫ్రాంజెన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అరుదైన పురాతన ప్రదర్శనను వీలైనంత ఎక్కువ కాలం సుస్థిరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ‘‘మేం ప్రకృతి రక్షకులం. సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మేం దీనిని మానవ జాతికోసం భద్రపరచాలనుకుంటున్నాం. ఇది 2024 ఏప్రిల్ లోగా ప్రదర్శించబడుతుందని భావిస్తున్నాం’’ అని మ్యూజియం డైరెక్టర్ బ్రిగిట్టే అన్నారు.

WhatsApp Image 2023-07-06 at 6.47.52 PM.jpeg

Updated Date - 2023-07-06T19:35:44+05:30 IST