Crime: బైక్ యాక్సిడెంట్ అనుకున్నారు.. ఆ యువతి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్.. ప్రియుడి గురించి చెప్పి..

ABN , First Publish Date - 2023-08-22T10:42:27+05:30 IST

ఆ యువతికి పెళ్లి కుదిరింది.. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.. పెళ్లికి ముందు రోజు జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.. బైక్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకున్నారు.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న యువతి అసలు విషయం బయటపెట్టింది..

Crime: బైక్ యాక్సిడెంట్ అనుకున్నారు.. ఆ యువతి స్పృహలోకి వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్.. ప్రియుడి గురించి చెప్పి..

ఆ యువతికి పెళ్లి (Marriage) కుదిరింది.. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.. పెళ్లికి ముందు రోజు జరిగిన బైక్ యాక్సిడెంట్‌ (Bike Accident)లో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.. బైక్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందనుకున్నారు.. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్న యువతి అసలు విషయం బయటపెట్టింది.. తన స్టేట్‌మెంట్ ఇచ్చి ప్రాణాలు కోల్పోయింది.. షాకైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌ (Jaipur)కు సమీపంలోని భాంక్రోటాకు చెందిన నిషా అనే యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి ముందు రోజు నిషా షాపింగ్‌కు వెళ్లింది. ఆమె రోడ్డుపై నడుస్తుండగా బైక్‌పై వేగంగా వచ్చిన దీపేంద్ర అనే యువకుడు నిషాను ఢీకొట్టాడు. దీంతో నిషా తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దీపేంద్రను పోలీసులకు అప్పగించారు. ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగిందని పోలీసులను దీపేంద్ర నమ్మించాడు. అయితే హాస్పిటల్‌లో స్పృహలోకి వచ్చిన నిషా అసలు విషయం బయటపెట్టింది.

Viral: ఒక ల్యాంప్ కొనడం కోసం ఐకియా స్టోర్‌కు వెళ్లింది.. షాపింగ్ మొత్తం చేసిన తర్వాత అర చేతిలో ఆరు అడుగుల బిల్లు!

తనతో పాటు ఓ కంపెనీలో పని చేస్తున్న దీపేంద్ర చాలా రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడని చెప్పింది. పెళ్లి కుదిరిందని తెలిసిన దగ్గర్నుంచి చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. అయినా తను వినకపోవడంతో బైక్‌తో ఢీకొట్టాడని చెప్పింది. అనంతరం నిషా ప్రాణాలు కోల్పోయింది. దీపేంద్రపై హత్య కేసు పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-08-22T10:42:27+05:30 IST