Daughter: ``మా నాన్నను అమ్మేస్తున్నా.. రూ.2 లక్షలు ఉంటే సంప్రదించండి``.. తండ్రి మీద ఆ కూతురికి ఎందుకంత కోపమంటే..
ABN , First Publish Date - 2023-10-09T18:32:14+05:30 IST
ఆ ఎనిమిదేళ్ల పాపకు తన తండ్రి మీద కోపమొచ్చింది.. ఎంత కోపమొచ్చిందంటే ఎవరైనా కొనుక్కుంటే వెంటనే అమ్మేసేంత.. తన తండ్రిని రూ.2 లక్షలకు అమ్మేస్తున్నట్టు ఓ నోట్ రాసింది.. తండ్రి తనను మందలించాడని అలిగిన కూతురు ఏకంగా అతడిని ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకుంది.
ఆ ఎనిమిదేళ్ల పాపకు తన తండ్రి (Father) మీద కోపమొచ్చింది.. ఎంత కోపమొచ్చిందంటే ఎవరైనా కొనుక్కుంటే వెంటనే అమ్మేసేంత.. తన తండ్రిని రూ.2 లక్షలకు అమ్మేస్తున్నట్టు ఓ నోట్ రాసి తమ ఇంటి గేటుకు కూడా తగిలించింది.. తండ్రి తనను మందలించాడని అలిగిన కూతురు (Daugher) ఏకంగా అతడిని ఎలాగైనా అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Tweet) మారింది.
@Malavtweets అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ నోట్ కనిపిస్తోంది. ``మా నాన్నను రూ.2 లక్షలకు అమ్మేస్తున్నా. మరిన్ని వివరాలు కావాలంటే కాలింగ్ బెల్ కొట్టండి`` అని రాసి ఉంది (Father for sale). ఆ నోట్‌ను ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఉంచింది. ఆ నోట్‌ను ఫొటో తీసి ఆ పాప తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్న గొడవ కారణంగా తన కూతురు తనను అమ్మకానికి పెట్టిందని పేర్కొన్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: దెబ్బకు దారిలో పడింది.. నడిరోడ్డుపై యోగా చేసిన మోడల్.. పోలీసులు ఎలా బుద్ధి చెప్పారంటే..
ఆ పోస్ట్‌ను ఇప్పటివరకు 31 వేల మందికి పైగా వీక్షించారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``చిన్న పిల్లలు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు``, ``ఆ పాపకు అలాంటి ఐడియా ఎలా వచ్చింది``, ``మీరు చాలా గొప్ప తండ్రి. సహనంగా ఉండండి``, ``ఆ పాపకు చాలా కోపం వచ్చినట్టు ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.