Elon Musk: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. పండంటి కాపురాన్ని కూల్చేసిన ఎలాన్ మస్క్?

ABN , First Publish Date - 2023-09-16T20:57:06+05:30 IST

ఎలాన్ మస్క్‌తో తన భార్యకు ఎఫైర్ ఉందని తెలిసి గూగుల్ సహవ్యవస్థాపకుడు విడాకులు తీసుకున్నాడన్న వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.

Elon Musk: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. పండంటి కాపురాన్ని కూల్చేసిన ఎలాన్ మస్క్?

ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ సంస్థ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్(Sergey Brin) తన భార్య నికోల్ షానహన్‌కు విడాకులు(Divorces Nicole Shananon) ఇచ్చేశారన్న వార్త ప్రస్తుతం అమెరికాలో సంచలనంగా మారింది. వారి కాపురం కూలడానికి టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) అయి ఉండొచ్చన్న వార్త అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం బయటకు రాకుండా మే 26న సెర్గీ బ్రిన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. తమ నాలుగేళ్ల కూతురు కస్టడీ విషయంలోనూ వారి మధ్య అంగీకారం కుదిరిందట. భేదాభఇప్రాయాల కారణంగా విడిపోతున్నట్టు వారు విడాకుల సందర్భంగా చెప్పారట.

ఎలాన్ మస్క్‌కు, సెర్గీ బ్రిన్ మధ్య చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. అయితే మస్క్‌కు సెర్గీ భార్యతో వివాహేతర సంబంధం(Affair) ఉందన్న వార్త 2021లోఅంతర్జాతీయ మీడియాలో హల్‌చల్ చేసింది. అప్పట్లోనే మస్క్ ఈ వార్తను ఖండించారు. ఆ తరువాత బ్రిన్ ఆయన భార్యా విడిగా ఉండటం ప్రారంభించారట. సెర్గీ బ్రిన్ 2022లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, భార్య ఎఫైర్ గురించి తెలిసిన మరుసటి నెలలోనే సెర్గీ బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది.


ఈ ఎఫైర్ కారణంగా మస్క్, బ్రిన్‌ల స్నేహం చెడిందంటూ 2022లో వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ వ్యాసాన్ని మస్క్ అప్పట్లోనే ట్విట్టర్ వేదికగా ఖండించారు. ‘‘ఇదంతా చెత్త ఊహాగానాలు. సెర్గీ, నేను స్నేహితులం. గత రాత్రే ఇద్దరం ఓ పార్టీలో ఎంజాయ్ చేశాం. నికోల్‌ను (సెర్గీ భార్య) నేను గత మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే చూశాను. ఆమెను కలిసిన సమయంలో చుట్టూరా బోలెడంత మంది ఉన్నారు. మా మధ్య ఎటువంటి రొమాంటిక్ బంధం లేదు’’ అని మస్క్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ వార్తలపై నికోల్ కూడా అప్పట్లో మండిపడ్డారు. ఈ వార్త తనను ఎంతగానో కుంగదీసిందంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. ‘‘నేను మస్క్‌కు సన్నిహితం కాలేదు. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. మా మధ్య స్నేహం మినహా మరేమీ లేదు’’ అని తేల్చి చెప్పారు. వాల్ స్ట్రీట్ మాత్రం తమ వార్తకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. తమకు ఈ వార్త చెప్పిన వారిపై పూర్తి నమ్మకం ఉందని రాసుకొచ్చింది.

2015లో సెర్గీకి నికోల్ షానహన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్న సమయంలో సెర్గీ నికోల్‌కు దగ్గరయ్యారు. 2018 వారు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత నాలుగేళ్లకే వారి బంధం తెగిపోయింది.

Updated Date - 2023-09-16T21:00:40+05:30 IST