google gurugram office: ఆ సంస్థ.. ఉద్యోగులకు అందించే సౌకర్యాలు చూస్తే.. ‘వారేవ్వా’ అనకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2023-03-27T11:41:56+05:30 IST

google gurugram office: ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన Google అద్భుతమైన కార్యాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఉద్యోగులకు(employees) సంస్థ అద్భుతమైన సౌకర్యాలను అందిస్తుంది.

google gurugram office: ఆ సంస్థ.. ఉద్యోగులకు అందించే సౌకర్యాలు చూస్తే.. ‘వారేవ్వా’ అనకుండా ఉండలేరు!

google gurugram office: ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన Google అద్భుతమైన కార్యాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఉద్యోగులకు(employees) సంస్థ అద్భుతమైన సౌకర్యాలను అందిస్తుంది. తొలగింపుల కారణంగా గూగుల్ పేరు ఇటీవలి కాలంలో ముఖ్యాంశాలలో నిలిచినప్పటికీ, తాజాగా గూగుల్ ఉద్యోగి ఒకరు సంస్థకు చెందిన గురుగ్రామ్ కార్యాలయం(Gurugram Office) వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

గురుగ్రామ్‌లో ఉన్న ఈ టెక్ కంపెనీ(tech company) కార్యాలయం విలాసవంతమైన మాల్‌ కంటే ఏమాత్రం తక్కువ కాదని అతను షేర్ చేసిన వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ కార్యాలయంలో ఉద్యోగుల సౌకర్యం(Employee comfort), వినోదం కోసం అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ సంస్థ అత్యుత్తమ పని ప్రదేశాలలో(best workplaces) ఒకటి అనే బిరుదును కూడా చాలాసార్లు అందుకుంది. కంపెనీ సీనియర్ కన్సల్టెంట్‌ ఆదిశ్రీ కుంచల్ తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా గూగుల్ ఆఫీస్‌(Google Office)లోని సకల సౌకర్యాలను చూపించారు.

ఈ వీడియోలో అతను గూగుల్ కార్యాలయంలో ఉద్యోగులకు ఫలహారశాల(cafeteria)లో అద్భుతమైన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల వినోదం కోసం వినోద గది, సంగీత గది కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే స్పా, జిమ్(Gym) సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని కూడా వర్కవుట్(workout) చేయవచ్చు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోలో ఆద్యశ్రీ కుంచల్ గూగుల్ గురుగ్రామ్ కార్యాలయం యూఎస్‌లోని కార్యాలయం కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. ఇక్కడ సిబ్బందికి శాండ్‌విచ్‌(Sandwich)లు, టీ, కాఫీ కూడా ఉచితంగా అందిస్తారని తెలియజేశారు.

Updated Date - 2023-03-27T13:42:41+05:30 IST