Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. రూ.10 వేల జరిమానా ముప్పును ముందే తప్పించుకోండి..!

ABN , First Publish Date - 2023-03-28T16:40:52+05:30 IST

మీ ఆధార్ కార్డ్‌ను ఇంకా పాన్ కార్డ్‌‌తో లింక్ చేయలేదా..? కంగారు పడకండి.. పాన్-ఆధార్ లింక్ చేసే తుది గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో ఈ గడువు ముగిసిపోబోతోంది. అయితే..

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు ఇంపార్టెంట్ అలెర్ట్.. రూ.10 వేల జరిమానా ముప్పును ముందే తప్పించుకోండి..!

మీ ఆధార్ కార్డ్‌ను ఇంకా పాన్ కార్డ్‌‌తో లింక్ చేయలేదా..? (PAN Link with Aadhaar) కంగారు పడకండి.. పాన్-ఆధార్ లింక్ చేసే తుది గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. ఈ నెల 31వ తేదీతో ఈ గడువు ముగిసిపోబోతోంది. అయితే ఇప్పటికి కూడా ఇంకా పూర్తి చేయని వారికి వెసులు బాటు కల్పించే ఉద్దేశంతో ఆ గడువును జూన్ 30 (June 30) వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆ గడువు లోపు పూర్తి చేయకపోతే ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాలు నిలిచిపోతాయి. జూన్ 30 తర్వాత లింక్ చేయాలనుకుంటే రూ.1000 నుంచి 10000 వరకు జరిమానా (Fine) చెల్లించాల్సి ఉంటుంది.

పాన్-ఆధార్ లింక్ అనేది ప్రతి భారతీయ పౌరుడు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, బ్యాంకు లావాదేవీల్లో పాన్‌ కార్డు (Pan Card), ఆధార్‌ కార్డు (Aadhaar Card) అతి ముఖ్యమైనవి. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం (Central Government) పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి తేదీ 31 మార్చి 2023.. అయితే ఇప్పుడు దానిని జూన్ 30కి పెంచారు. IT చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు గడువు తేదీ తర్వాత నిలిచిపోతాయి.

ఆధార్-పాన్‌ లింక్‌ ఎలా..? (How to link PAN with Aadhaar )

* ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* వెబ్‌సైట్‌లో ఉన్న ఆధార్‌ లింక్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

* అక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

* మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేయాలి.

Fridge Leaking Water: ఫ్రిడ్జ్‌లోంచి నీళ్లు బయటకు వస్తున్నాయా..? ఈ సింపుల్ స్టెప్స్‌తో లీకేజీ సమస్యకు చెక్ పెట్టండి..!

Updated Date - 2023-03-28T16:40:52+05:30 IST