Viral: అత్తగారి ప్రవర్తనతో వరుడు షాక్.. కొద్ది నిమిషాల్లో పెళ్లనగా క్యాన్సిల్.. అసలు ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2023-07-01T11:38:10+05:30 IST

ఆ యువకుడికి పెళ్లి కుదిరింది.. అంగరంగ వైభవంగా బంధుమిత్రులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకున్నాడు.. పెళ్లిలో వధువు తరఫు వారు, వరుడి తరఫు వారు సరదాగా గడిపారు.. వివాహ వేదిక వద్ద డీజే ఏర్పాటు చేశారు.. ఆ డీజే పాటలకు అనుగుణంగా వరుడికి కాబోయే అత్తగారు చిందులేశారు..

Viral: అత్తగారి ప్రవర్తనతో వరుడు షాక్.. కొద్ది నిమిషాల్లో పెళ్లనగా క్యాన్సిల్.. అసలు ఏం జరిగిందంటే...

ఆ యువకుడికి పెళ్లి (Wedding) కుదిరింది.. అంగరంగ వైభవంగా బంధుమిత్రులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకున్నాడు.. పెళ్లిలో వధువు తరఫు వారు, వరుడి తరఫు వారు సరదాగా గడిపారు.. వివాహ వేదిక వద్ద డీజే (DJ) ఏర్పాటు చేశారు.. ఆ డీజే పాటలకు అనుగుణంగా వరుడికి కాబోయే అత్తగారు (Mother-in-law ) చిందులేశారు.. అంతేకాదు ఆ సమయంలో ఆమె సిగరెట్ (Smoking) కూడా కాల్చుతూ డ్యాన్స్‌లు వేశారు.. అత్తగారి ప్రవర్తన నచ్చకపోవడంతో వరుడు (Groom) పెళ్లి రద్దు చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని సంభాల్ జిల్లాలో సరయాత్రిన్‌లో నివసిస్తున్న యువకుడి వివాహం రాజ్‌పురాకు చెందిన అమ్మాయితో నిశ్చయమైంది. మంగళవారం సాయంత్రం వరుడు ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. పెళ్లిలో ప్రత్యేకంగా డీజే కూడా ఏర్పాటు చేశారు. డీజే సందర్భంగా వధువు తరఫు వారు డ్యాన్స్‌లు వేశారు. వధువు తల్లి కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేసింది. ఆ సమయంలో ఆమె సిగరెట్ కూడా కాల్చింది.

Wife: బాత్రూంకు వెళ్లి వస్తానంటూ భర్తకు చెప్పి వెళ్లి.. ఎంతకూ తిరిగిరాని భార్య.. పెళ్లయిన 4 నెలల తర్వాత రెస్టారెంట్‌కు తీసుకెళ్తే..

తనకు కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేయడం చూసి వరుడు షాక్ అయ్యాడు. వధువు తరఫు వారిని నిలదీశాడు. దీంతో వారు కూడా వరుడిపై ఫైర్ అయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పెళ్లి ఆగిపోయింది. వరుడు, వధువు ఎవరి కుటుంబ సభ్యులతో వారు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

Updated Date - 2023-07-01T11:38:10+05:30 IST