Viral Video: ఆ అమ్మాయికి భవిష్యత్తు కనబడింది.. పెళ్లి వేడుకలో వధువును ఎలా రక్షించాడో చూడండి..

ABN , First Publish Date - 2023-05-12T15:46:09+05:30 IST

బంధు మిత్రుల సందడి, విందులు, వినోదాలతో వివాహ కార్యక్రమం చాలా సందడిగా సాగుతుంది. ముఖ్యంగా సంగీత్, మెహందీ వంటి కొత్త కొత్త కార్యక్రమాలో వచ్చి చేరాక పెళ్లి మరింత వైభవంగా మారిపోయింది.

Viral Video: ఆ అమ్మాయికి భవిష్యత్తు కనబడింది.. పెళ్లి వేడుకలో వధువును ఎలా రక్షించాడో చూడండి..

బంధు మిత్రుల సందడి, విందులు, వినోదాలతో వివాహ కార్యక్రమం (Marriage) చాలా సందడిగా సాగుతుంది. ముఖ్యంగా సంగీత్, మెహందీ వంటి కొత్త కొత్త కార్యక్రమాలో వచ్చి చేరాక పెళ్లి మరింత వైభవంగా మారిపోయింది. ఒక్కో ప్రాంతం, మతం, కులాన్ని బట్టి వివాహ సాంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యామాని అవన్నీ ఇతరులకు కూడా సులభంగా తెలిసిపోతున్నాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి.

నేపాల్‌లో (Nepal) కూడా హిందువులు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. అక్కడి వివాహ సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులు పెళ్లి మండపంలో కూర్చుని ఉండగా వారి వెనుక కొందరు వ్యక్తులు అటూ ఇటూ నిలబడి ఎర్రటి వస్త్రాన్ని లాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు పట్టు తప్పి వధువును కాలితో తోసేశాడు. వెంటనే వరుడు (Groom) అప్రమత్తమై ఆమెకు రక్షణగా నిలిచాడు. వధువు (Bride)కు ఎవరూ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

Viral Video: చాలా సంతోషంగా ఉంది బిడ్డా.. తండ్రిని తొలిసారి విమానం ఎక్కించిన కొడుకు.. అతడి రియాక్షన్ ఏంటంటే..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 8.5 లక్షల మంది లైక్ చేశారు. వరుడి ప్రవర్తన చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ``ఆ అమ్మాయి భవిష్యత్తు అర్థమవుతోంది.. ఆమెకు ఏ కష్టం రానివ్వడు``, ``చాలా మంచి భర్త``, ``ప్రేమ వివాహం అయి ఉంటుంద``ని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-12T15:46:09+05:30 IST