Viral: వేదిక మీద ఒంటరిగా ఉన్న వధువు.. వరుడు ఎంతకీ రాకపోవడంతో టెన్షన్.. చివరకు అసలు విషయం తెలిసి..

ABN , First Publish Date - 2023-06-25T16:43:13+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో సిద్ధి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మసూరిహా గ్రామానికి చెందిన యువకుడికి డోల్ కోథార్‌కు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం అయింది. ముహూర్తం రోజు అన్నీ అనుకున్న ప్రకారమే జరిగాయి. ఆ తర్వాత వరుడు షాకిచ్చాడు.

Viral: వేదిక మీద ఒంటరిగా ఉన్న వధువు.. వరుడు ఎంతకీ రాకపోవడంతో టెన్షన్.. చివరకు అసలు విషయం తెలిసి..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సిద్ధి జిల్లాలో సిద్ధి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మసూరిహా గ్రామానికి చెందిన యువకుడికి డోల్ కోథార్‌కు చెందిన అమ్మాయితో వివాహం (Marriage) నిశ్చయం అయింది. ముహూర్తం రోజు అన్నీ అనుకున్న ప్రకారమే జరిగాయి. తిలకోత్సవం మొదలు పెళ్లి క్రతువులన్నీ అంగరంగ వైభవంగా జరిగాయి. వరమాల సమయంలో వరుడు షాకిచ్చాడు. పెళ్లి వేదిక నుంచి పారిపోయాడు (Groom ran away from wedding stage). ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.

ముహూర్తం రోజున వరుడు (Groom) బంధుమిత్రులతో కలిసి వైభవంగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. వధువు తరఫు వారు పెళ్లికొడుక్కి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. పెళ్లి కార్యక్రమాల్లో కూడా వరుడు పాల్గొన్నాడు. అయితే జయమాలకు ముందు వధువు (Bride)ను వదిలి బైక్‌పై వరుడు దొంగచాటుగా బయటికి వెళ్లిపోయాడు. వరుడి కోసం వధువు పెళ్లి వేదికపై గంటకు పైగా ఎదురు చూసింది. వరుడు ఎంతకీ తిరిగి రాలేదు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.

Viral Video: ఇంకెప్పుడూ అమ్మాయిల జోలికి వెళ్లడు.. నడిరోడ్డు మీద పోకిరీని చితక్కొట్టిన అక్కాచెల్లెళ్లు.. వీడియో వైరల్!

వరుడికి అప్పటికే మరో యువతితో వివాహం అయిపోయింది. ప్రేమించిన యువతిని వరుడు రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయినా తల్లిదండ్రుల బలవంతం చేయడంతో మరో పెళ్లికి అంగీకరించాడు. చివరకు తన భార్యకు అన్యాయం చేయడం ఇష్టం లేక పెళ్లి వేదిక నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాల వారు రాజీ పడి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.

Updated Date - 2023-06-25T16:43:13+05:30 IST