Men will be Men: పెళ్లి వేదికపైనే పాలు తాగుతూ ఈ వరుడు చేసిన పనికి కడుపుబ్బా నవ్వుకున్న వధువు.. ఈ వీడియోను చూస్తే..!
ABN , First Publish Date - 2023-05-06T16:13:03+05:30 IST
``మెన్ విల్ బి మెన్``.. టీవీ యాడ్స్లలో బాగా పాపులర్ అయి ప్రముఖ కొటేషన్‌గా స్థిరపడింది. మగ బుద్ధి గురించి వర్ణించేందుకు ఈ వాఖ్యాన్ని వాడుతున్నారు. అయితే నిజ జీవితంలో కొందరు పురుష పుంగవుల తీరు గమనిస్తే మాత్రం ఈ కొటేషన్ గుర్తుకు రాక తప్పదు
``మెన్ విల్ బి మెన్`` (Men will be Men).. టీవీ యాడ్స్లలో బాగా పాపులర్ అయి ప్రముఖ కొటేషన్‌గా స్థిరపడింది. మగ బుద్ధి గురించి వర్ణించేందుకు ఈ వాఖ్యాన్ని వాడుతున్నారు. అయితే నిజ జీవితంలో కొందరు పురుష పుంగవుల తీరు గమనిస్తే మాత్రం ఈ కొటేషన్ గుర్తుకు రాక తప్పదు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Video) వరుడు ఛీర్స్ (Cheers) కొట్టి తన మగబుద్ధిని బయటపెట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వధూవరులు పెళ్లి వేదికపై కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ వారి బంధువర్గానికి చెందిన మహిళలు నిల్చున్నారు. వధూవరుల చేతుల్లో పాల గ్లాసులు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం వధూవరులు ఒకరిచేత మరొకరు పాలు తాగించాలి. దాంతో వధువు (Bride) తన చేతిలోని పాల గ్లాసును వరుడి నోటి దగ్గరకు తీసుకెళ్తుండగా.. వరుడు అలవాటులో పొరపాటుగా తన చేతిలో ఉన్న పాల గ్లాసుతో ``ఛీర్స్`` కొట్టాడు (Groom says cheers to bride). దాంతో వధువు నవ్వాపుకోలేకపోయింది. చుట్టూ ఉన్న వారు కూడా నవ్వుకున్నారు.
Shocking Video: ఫేమస్ అయేందుకు ఇవేం పిచ్చి పనులు.. నోట్లో బాంబును పెట్టుకుని.. లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు.. చివరకు..!
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ``పాపం.. ఆ వరుడు బ్యాచిలర్ పార్టీ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదు``, ``ఆ వరుడికి మ్యానర్స్ తెలుసు``, ``ఆ వధువుకి తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమయ్యే ఉంటుంది``, ``మెన్ విల్ బి మెన్`` అని కామెంట్లు చేశారు.