Groom Video: పెళ్లి వేదికపై ఈ వరుడి వ్యవహారం మామూలుగా లేదుగా.. వధువు మొహమాట పడుతున్నా అస్సలు ఆగడం లేదు.. చివరకు..!
ABN , First Publish Date - 2023-05-15T15:26:48+05:30 IST
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల నడుస్తోంది. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Marriage) నడుస్తోంది. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (Viral Videos) ఓ వరుడి డ్యాన్స్, దానికి వధువు రియాక్షన్ నెట్టింట అందర్నీ అకట్టుకుంటున్నాయి. @HasnaZarooriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో పాట ప్లే అవుతుంటే వేదిక మీద ఉన్న వరుడు (Groom Dance) సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నాడు. వధువు (Groom) చేత కూడా డ్యాన్స్ చేయించాలనుకున్నాడు. అయితే వధువు సిగ్గు పడి డ్యాన్స్ చేయలేదు. అయినా వరుడు మాత్రం ఆమె చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేశాడు. వరుడి డ్యాన్స్‌ను వధువు నవ్వుతూ చూస్తుండిపోయింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో ఇలా చేస్తే.. ఏం జరుగుతుందో తెలిసి కూడా ఓ వ్యక్తి వింత చేష్టలు.. చివరకు..!
ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది వీక్షించారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పెళ్లి కొడుకు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. ``చివరిసారి సంతోషంగా డ్యాన్స్ వేస్తున్నాడు`` అని ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు.