Hair oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే భృంగరాజ్ నూనెను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితాలు చూసి మీరే షాకవుతారు!!

ABN , First Publish Date - 2023-09-24T15:31:07+05:30 IST

భృంగరాజ్ నూనె వాడినా జుట్టు పెరుగుదలలో ఎలాంటి ఫలితాలు లేవని కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువశాతం మందికి ఈ నూనె ఎలా వాడాలో తెలియదు..

Hair oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే భృంగరాజ్ నూనెను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితాలు చూసి మీరే షాకవుతారు!!

భృంగరాజ్ తైలం లేదా భృంగరాజ్ ఆయిల్ జుట్టును నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అందుకే దీన్ని కేష్ కింగ్ అని అన్నారు. ఈ నూనెలో ఐరన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడానికి కారణమయ్యే లోపాలను భర్తీ చేస్తాయి. చాలామంది జుట్టు పెరుగుదల కోసం భృంగరాజ్ ఆయిల్ ను సొంతంగా తయారు చేసుకోవడం లేదా బయటి నుండి తెచ్చుకుని వాడటం చేస్తుంటారు. ఈ నూనె వాడినా జుట్టు పెరుగుదలలో ఎలాంటి ఫలితాలు లేవని కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువశాతం మందికి ఈ నూనె ఎలా వాడాలో తెలియదు..

జుట్టుకు నూనె ఏదో ఒక విధంగా పెట్టేస్తే జుట్టు పెరుగుదల సాధ్యం కాదు. నూనెను ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేస్తున్నాం అనేదానిపై జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. భృంగరాజ్ నూనె(bringaraj oil) శక్తివంతమైనదే.. ఇది జుట్టు మీద ప్రభావవంతంగా పనిచేయాలంటే భృంగరాజ్ నూనెను వారంలో రెండు నుండి మూడు సార్లు ఉపయోగించాలి. అలాగే కేవలం భృంగరాజ్ నూనెను మాత్రమే కాకుండా దీని జతకు ఉసిరి, బ్రహ్మీ, నువ్వుల నూనెలలో కనీసం రెండింటిని మిక్స్ చేసి వాడాలి.

Viral Video: మెట్రో రైల్లో పుషప్స్ తీస్తూ రెచ్చిపోయిన కుర్రాడు.. పక్కనే ఉన్న ఓ వ్యక్తిని ఒత్తిడి చేయడంతో ఏం జరిగిందంటే..



నూనె ఎలా అప్లై చేయాలంటే..

ఉసిరి, నువ్వుల నూనె, బ్రహ్మీ వీటిలో ఏవైనా రెండు నూనెలు ఒక పరిమాణంలో, భృంగరాజ్ నూనెను ఆ రెండింటి సమాన పరిమాణంలో ఒక కప్పులో మిక్స్ చేసుకోవాలి. ఈ నూనెను డబుల్ బాయిల్ మెథడ్(నీటిని మరిగించి ఆ నీటిలో నూనె కప్పును కొద్దిసేపు ఉంచితే నూనె వేడి అవుతుంది) ద్వారా వేడి చేయాలి. దీన్ని మునివేళ్లతో తీసుకుంటూ కుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలి. తరువాత ఒక మందం టవల్ తీసుకుని వేడినీటిలో ముంచి నీటిని పిండేయాలి. ఈ టవల్ వేడిగా ఉండగానే దీన్ని తలకు చుట్టాలి. టవల్ లో ఉన్న వేడి జుట్టు కుదుళ్ళ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. తద్వారా నూనె లోపలికి ఇంకి జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో, నల్లగా మారడంలో సహాయపడుతుంది. వేడి టవల్ ను 5 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి. రాత్రి సమయంలో ఇలా నూనె అప్లై చేసి మరుసటిరోజు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి. ఇది చాలా ఉత్తమమైన ఆయిల్ థెరపీ. భృంగరాజ్ నూనెను ఇలా వాడటం ద్వారా జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లజుట్టు మీద ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Health Fact: కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తుంటారా? వీటి గురించి ఈ నిజాలు తెలిస్తే..


Updated Date - 2023-09-24T15:31:07+05:30 IST