Hansika Motwani: తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు గట్టిగా సమాధానమిచ్చిన హీరోయిన్
ABN , First Publish Date - 2023-02-10T21:07:19+05:30 IST
బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది.
బాల్య నటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారిన అందాల భామ హన్సిక మోత్వానీ (Hansika Motwani). ప్రియుడు సోహైల్ కతూరియా (Sohail Kathuria) ను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆమె వెడ్డింగ్ వీడియో తాజాగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లో రిలీజ్ అయింది. ‘లవ్ షాదీ డ్రామా’ (Love Shaadi Drama) టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీడియోలో తన పెళ్లికి సంబంధించిన అనేక ఆసక్తికర విశేషాలను హన్సిక తెలిపారు. సోహైల్ మొదటి పెళ్లి సంగతులను కూడా చెప్పారు. తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌కు చాలా గట్టిగా సమాధానమిచ్చారు. సెలబ్రిటీగా ఉన్నందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
‘‘సెలబ్రిటీగా ఉన్నందకు నేను మూల్యం చెల్లించుకున్నాను. అందరు చాలా సులభంగా నా వైపు వేలెత్తి చూపించి విలన్‌గా మార్చారు. అందులో నా తప్పేమీ లేదు. నేను సోహైల్‌ను పెళ్లి చేసుకుంటున్నానే వార్తలు బయటికి రాగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒత్తిడికి గురయ్యాను. అప్పుడు మా అమ్మ సలహాతో సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశాను. ఆ పిక్స్‌ను చూసి అందరు శుభాకాంక్షలు చెప్పారు. ఫలితంగా కొంచెం ఆందోళన చెందడం మానేశాను. పరిస్థితులు అన్ని కుదుటపడుతున్నప్పుడు సోహైల్‌కు గతంలోనే పెళ్లి అయిందనే వార్తలు బయటికి వచ్చాయి. ఆ వేడుకలో నేను పాల్గొన్న ఫొటోలను పలువురు నెటిజన్స్ షేర్ చేశారు. భార్యతో సోహైల్ విడిపోవడానికి నేనే కారణం అని విమర్శలు గుప్పించారు. నన్ను విలన్‌గా చిత్రీకరించారు. అయితే, సోహైల్ గతం గురించి నాకు తెలుసు. ఆయన విడాకులు తీసుకోవడానికి నేను ఏ మాత్రం కారణం కాదు’’ అని హన్సిక తెలిపారు. హన్సిక చెప్పిన మాటలను సోహైల్ కతూరియా సమర్థించారు. ‘‘నా గత పెళ్లి గురించి నెగెటివ్‌గా రాశారు. హన్సిక వల్ల బ్రేకప్ అయిందన్నారు. కానీ, అది నిజం కాదు. నాకు 2014లో వివాహం అయింది. కానీ, కొద్ది కాలానికే అభిప్రాయ విభేదాలతో విడిపోవాల్సి వచ్చింది’’ అని సోహైల్ కతూరియా పేర్కొన్నారు.