Mobile: మొబైల్ పోయిందా? అయితే వెంటనే ఇలా చేయండి.. 190 ఫోన్లను రికవరీ చేసిన నొయిడా పోలీసులు!
ABN , First Publish Date - 2023-10-10T14:58:17+05:30 IST
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎన్నో పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ అనేది ప్రజలకు ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లినా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. దీంతో మొబైల్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సెకెండ్ హ్యాండ్ మొబైల్స్‌కు కూడా భారీ డిమాండ్ ఉండడంతో దొంగలు చెలరేగిపోతున్నారు.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) లేకపోతే ఎన్నో పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ అనేది ప్రజలకు ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఎక్కడకు వెళ్లినా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. దీంతో మొబైల్ దొంగతనాలు (Mobile Thefts) విపరీతంగా పెరిగిపోయాయి. సెకెండ్ హ్యాండ్ మొబైల్స్‌కు (Second hand Mobiles) కూడా భారీ డిమాండ్ ఉండడంతో దొంగలు మొబైల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఎంతో మంది మొబైల్స్ పోగొట్టుకుంటుంటారు. కొన్ని రోజులు బాధపడి తిరిగి కొత్త మొబైల్ కొనుక్కుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే పోలీసుల (Police)కు ఫిర్యాదు చేస్తుంటారు.
మొబైల్స్ పోగొట్టుకున్న వారి ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్న నోయిడా పోలీసులు (Noida Police) శుక్రవారం నాటికి ఏకంగా 191 ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ అక్షరాలా రూ.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్స్ అన్నీ ఏడాది క్రితం చోరీకి గురయ్యాయి. నోయిడా జోన్‌లో ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఓ స్పెషల్ టీమ్ ఏర్పాటైంది. పోయిన మొబైల్‌లలో ఏవి యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవడానికి అన్ని మొబైల్ ఫోన్‌లను IMEI నంబర్ ద్వారా ట్రేస్ చేశారు. ఇందుకోసం మహిళా కానిస్టేబుల్ ప్రీతిని నియమించారు.
Viral Video: వార్నీ.. ఆ వయసులోనే అమ్మాయి కోసం ఫైటింగా? సినిమా తరహాలో కొట్టుకున్న ఇద్దరు విద్యార్థులు!
చోరీ చేసిన మొబైల్స్ అన్నింటినీ దొంగలు సెకెండ్ హ్యాండ్ సెల్ షాపులకు అమ్మేశారు. వాటిని షాపు యజమానులు కొత్త వినియోగదారులకు అమ్మేశారు. IMEI నంబర్ ట్రేస్ చేసి ఆ మొబైల్స్‌కు కాల్స్ చేసి వాటిని రికవరీ చేసుకున్నారు. సెకెండ్ హ్యాండ్ మొబైల్ దుకాణాల్లో ఎవరూ మొబైల్స్ కొనకూడదని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. అలాగే మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని, అలా చేస్తేనే పోయిన మొబైల్ తిరిగి దొరికే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.