Health Alert: కొన్ని వస్తువులు మన టాయిలెట్ సీటు కంటే మురికిగా ఉంటాయి..ఏంటో తెలుసా..?
ABN , First Publish Date - 2023-07-03T23:05:51+05:30 IST
సాధారణంగా మన ఇళ్లు, ఆఫీసుల్లో ఏదీ అత్యంత మురికైన ప్రదేశం అంటే.. టాయిలెట్ అని చెబుతాం. కానీ అంతకంటే ఎక్కువ మురికైన ప్రదేశాలు, వస్తువులు మన చుట్టూనే ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అవేంటో కాదు మనం నిత్యం వాడే పరికరాలే. రోజువారీ జీవితంలో ఇవి లేకుండా, వీటిని తాకకుండా మనం పనిచేయలేం. టాయిలెట్ సీటు కంటే ఎక్కువ క్రిములు, బ్యాక్టిరియా కలిగి వున్న కొన్ని వస్తువులు, వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
సాధారణంగా మన ఇళ్లు, ఆఫీసుల్లో ఏదీ అత్యంత మురికైన ప్రదేశం అంటే.. టాయిలెట్ అని చెబుతాం. కానీ అంతకంటే ఎక్కువ మురికైన ప్రదేశాలు, వస్తువులు మన చుట్టూనే ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అవేంటో కాదు మనం నిత్యం వాడే పరికరాలే. రోజువారీ జీవితంలో ఇవి లేకుండా, వీటిని తాకకుండా మనం పనిచేయలేం. టాయిలెట్ సీటు కంటే ఎక్కువ క్రిములు, బ్యాక్టిరియా కలిగి వున్న కొన్ని వస్తువులు, వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
మనం ఉపయోగించే ఫోన్:
అత్యంత మురికైన వస్తువుల్లో మనం నిత్యం ఉపయోగించే సెల్‌ఫోన్ మొదటిది. దీనిపై టాయిలెట్ కంటే 10రెట్లు బ్యాక్టీరియా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. మనం తాకే ప్రతి వస్తువు నుంచి క్రిములు చేతుల్లో చేరి ఆ తర్వాత సెల్‌ఫోన్‌పై చేరతాయి. సెల్‌ఫోన్‌ను ప్రతి రోజు శుభ్రం చేయకపోతే ఆనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. సెల్‌ఫోన్‌ను శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ లేదా సబ్బుతో ఉన్న తడి గుడ్డతో ఉపయోగించాలి.
మనం ఉపయోగించే కీబోర్డు:
మనం తరుచుగా టచ్ చేసే వస్తువుల్లో కీబోర్డు అత్యధికంగా బ్యాక్టీరియా ఉండే రెండో వస్తువు. అరిజోనా యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. సగటున కీబోర్డులో ప్రతి చదరపు అంగుళం దాదాపు 30వేల బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట. కీబోర్డును వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి శుభ్రం చేస్తేగానీ మనం అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం.
మనం ఉపయోగించే మౌస్:
మనం ఉపయోగించే మౌస్ ఎంత మురికిగా ఉంటుందో మనం ఊహించలేం. కాలిఫోర్నియాలోని ఓ యూనివర్సిటీ పరిశోధనల్లో సగటున 1500 బ్యాక్టీరియా మౌస్ ఉంటాయని తేలింది.
రిమోట్ కంట్రోల్ :
ఇంట్లో మనం ఉపయోగించే వస్తువుల్లో అత్యధికంగా బ్యాక్టీరియా ఉండే మరొక వస్తువు రిమోట్. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యయనంలో రిమోట్‌లో చదరపు అంగుళానికి 200 బ్యాక్టీరియా ఉంటుందని తేలింది.
వాష్ రూమ్ డోర్ హ్యాండిల్స్(Washroom door knobs)
వాష్ రూమ్ డోర్ హ్యాండిల్స్ తరుచుగా టచ్ చేస్తుంటాం..అదీ పబ్లిక్ వాష్‌రూమ్ అయితే ఎక్కువమంది టచ్ చేస్తుంటారు కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువగానే చేరుతుంది. వీటిని ఎక్కువ శానిటైజ్ చేయకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుంది.
నీటి కొలాయిలు(Water Taps):
చేతులు కడుక్కునేందుకు వెళ్లినప్పుడు మనం మొదటి టచ్ చేసేది వాటర్ టాప్. దీంతో ఇది బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది. నీటి కొలాయిని శుభ్రం చేయకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి.. చేతులు కడిగే ఉపయోగించే సబ్బు లేదా డిటర్జెంట్‌తో నీటి కొలాయిలు శుభ్రం చేసుకుంటే ఎంతో మేలు.
రిఫ్రిజిరేటర్ డోర్ (Your Refrigerator Door)
మనం చేతులు కడుక్కోకుండా తాకే మరో వస్తువు రిఫ్రిజిరేటర్ డోర్.యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవీస్ అధ్యయనం ప్రకారం రిప్రిజిరేటర్ డోర్ సగటున చదరపు అంగుళానికి 500 బ్యాక్టీరియాను కలిగి ఉంటుందని తేలింది.
సంవత్సర కాలంగా అధ్యయనం నిర్వహించి సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను మోసుకెల్లే పైన పేర్కొనబడిన తరుచుగా వాడే వస్తువులను గుర్తించడం జరిగింది. అయితే వీటిలో అన్ని బ్యాక్టీరియాలు హానికరం కాకపోవచ్చు. అయినా మన పరిసరాలు, మనం తాకే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అప్పుడే ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధులనుంచి రక్షించుకోవచ్చు.