Saffron colour Science: ‘కాషాయం’ కేవలం ఒక రంగు మాత్రమే కాదు... అది చేసే మేలు గురించి తెలిస్తే...
ABN , First Publish Date - 2023-04-25T08:06:17+05:30 IST
Saffron colour Science: హిందూమత విశ్వాసాల ప్రకారం కాషాయ రంగు(Saffron colour) సూర్యాస్తమయంతో పాటు అగ్నిని సూచిస్తుంది. సూర్యుడు, అగ్ని మానవ జీవితంలోని రెండు ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు.
Saffron colour Science: హిందూమత విశ్వాసాల ప్రకారం కాషాయ రంగు(Saffron colour) సూర్యాస్తమయంతో పాటు అగ్నిని సూచిస్తుంది. సూర్యుడు, అగ్ని మానవ జీవితంలోని రెండు ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. వాటిని బలమైన శక్తులుగా భావిస్తారు. హిందూ ధర్మం(Hindu Dharma)లో సప్త చక్రాల వర్ణనన కనిపిస్తుంది. ఈ చక్రాలు మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతాయి. ఈ చక్రాలు ఏడు రంగులను ప్రతిబింబిస్తాయి.
శరీరంలోని ఆ ఏడు చక్రాలు(Seven Chakras) ఇవే.. మూలధార (ఎరుపు), స్వాధిష్ఠాన (నారింజ), మణిపూరక (పసుపు), అనాహత (ఆకుపచ్చ), విశుద్ధి (నీలం), అగ్ని (నీలిమందు) సహస్రార (వైలెట్). వీటిలోని ప్రతి రంగు మన మనసుపై(mind) విభిన్న ప్రభావాన్ని చూపుతుంది. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం(Scientific reason) కూడా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ చక్రాలలో ఒకటి కాషాయ చక్రం, దీనిని స్వాధిష్ఠాన లేదా త్రికా చక్రం అని కూడా పిలుస్తారు.
ఈ చక్రం శరీరంలోని మూత్రాశయం, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ, మూత్రాశయం(Urinary bladder)తో సంబంధం కలిగి ఉంటుంది. మనిషి తన జీవితంలో నిరంతరం దీనిపై దృష్టి పెట్టడం ద్వారా మానసికంగా, శారీరకంగా(Physically) అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రంగు వెనుక సైన్స్ ఉందని, ఈ రంగుకు గొప్ప శక్తి ఉందని చెబుతారు.
కాషాయ వర్ణం కలిగిన కుంకుమపువ్వు(Saffron) మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తూ, చురుకుగా ఉంచుతుంది. దీర్ఘకాలికంగా వేధించే టీబీ, పైల్స్ తదితర వ్యాధులకు కుంకుమపువ్వుతో చేసే చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. కాషాయరంగు(Saffron colour) మెదడుకు మేలు చేస్తుందని చెబుతారు.