Share News

Health Facts: ఎన్నిసార్లు మంచినీళ్లు తాగినా దప్పిక తీరడం లేదా..? ఈ వ్యాధులే కారణం కావచ్చు..!

ABN , First Publish Date - 2023-11-22T12:29:15+05:30 IST

కొందరికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నిమిషాలు కూడా గడవకనే మళ్లీ దాహం వేస్తుంది. నోరంతా ఆరిపోతుంటుంది. అసలిలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

Health Facts: ఎన్నిసార్లు మంచినీళ్లు తాగినా దప్పిక తీరడం లేదా..? ఈ వ్యాధులే కారణం కావచ్చు..!

నీరు శరీరానికి ఇంధనం వంటిది. ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతారు. దీని వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. శరీరంలో అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉన్న విషపదార్థాలు, మలినాలు తొలగించడంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే కొందరికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నిమిషాలు కూడా గడవకనే మళ్లీ దాహం వేస్తుంది. నోరంతా ఆరిపోతుంటుంది. అసలిలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక, అదేమైనా జబ్బుకు సంకేతమా తెలియక సతమతమయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరకపోవడం వెనుక ఈ ప్రమాదకరమైన వ్యాధులు ఉండే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ఎక్కువగా దాహం వేస్తుంటే అది మధుమేహనికి ఒక సంకేతమని వైద్యులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు శరీరం మూత్రవిసర్జన ద్వారా దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి దాహం వేస్తుంది.

ఇది కూడా చదవండి: Early Dinner: రాత్రిపూట తొందరగా భోజనం చేయడం మంచిదేనా..? డాక్టర్లు చెబుతున్న నిజాలివీ..!



చాలామంది మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోవడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇది ఆహారం సరిగా లేకపోవడం, అధిక రక్తస్రావం వంటి కారణాల వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల అధిక దాహం వేస్తుంది. మైకంగా ఉండటం, అలసట, చెమటలు అధికంగా పట్టడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

నోరు పొడిబారడం వల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. పదే పదే నోటిని తడుపుకోవడానికి అధికంగా నీటిని మళ్లీ మళ్లీ తాగాల్సి వస్తుంది. ధూమపానం విపరీతంగా చేయడం, మందులు ఎక్కువ మోతాదులో వాడటం వంటి కారణాల వల్ల నోరు పొడిబారుతుంది. నోరు పొడిబారడమనే సమస్యను నిర్లక్ష్యం చేస్తే నోటి దుర్వాసన, రుచిలో మార్పు, చిగుళ్ల మంట, ఆహారం నమలడంలో ఇబ్బంది మొదలైన నోటి సంబంధ సమస్యలు వస్తాయి.

గర్భిణులలో కూడా అధిక దాహం వేస్తుంది. మొదటి మూడు నెలలలో రక్త పరిమాణం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలలో అదనంగా ద్రవం ఏర్పడటానికి కారణం అవుతుంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం, అధికంగా దాహం వేయడం గర్భవతులలో జరుగుతుంది.

ఇది కూడా చదవండి: ఇంటి ముందు తప్పకుండా పెంచాల్సిన 5 మొక్కలివీ..!

Updated Date - 2023-11-22T12:29:17+05:30 IST