Health Facts: మగాళ్లలోనే ఎక్కువగా కనిపించే ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా..? పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందంటే..!

ABN , First Publish Date - 2023-10-03T11:10:28+05:30 IST

అందరూ చాలా కామన్ అనుకునే మూత్రవిసర్జన సమస్య పదే పదే వేధిస్తుంటే అది పెద్ద ప్రమాదాలకు దారి తీరుస్తుంది.

Health Facts: మగాళ్లలోనే ఎక్కువగా కనిపించే ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా..? పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తోందంటే..!

ప్రతిరోజూ మనిషి తీసుకునే నీటిని శరీరం వినియోగించుకున్న తరువాత శరీరంలో లవణాలు, వ్యర్థాలు మొదలైనవి మూత్రం రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ప్రతి మనిషి ఇరవై నాలుగు గంటలలో 6నుండి 8 సార్లు మూత్రవిసర్జనకు వెళితే అతను ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్పబడుతుంది. అంటే మూత్రవిసర్జనకు వెళ్లడానికి ప్రతి సారి 3నుండి 4 గంటల గ్యాప్ ఉండాలి. కానీ పదే పదే మూత్రవిసర్ఝనకు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం అది మూత్రాశయ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. మగవారిలోనే ఎక్కువగా వచ్చే ఈ అరుదైన వ్యాధి గురించి, ఇది మగవారిలో ఎక్కువగా ఎందుకొస్తుందనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..

మూత్రాశయ క్యాన్సర్(bladder cancer) ఒకప్పుడు వృద్దులలో వచ్చేది. కానీ ప్రస్తుతం యువతలో ఉన్న అలవాట్లు, వారి జీవనశైలి మారడం వంటి కారణాల వల్ల మూత్రాశయ క్యాన్సర్ చిన్న వయసు వారిలో కూడా వస్తోంది. ప్రధానంగా మద్యపానం, ధూమపానం ఈ సమస్యకు కారణం అవుతున్నాయి.

ఎక్కువకాలం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్(urinary tract infection) సమస్య ఉండటం, రసాయనాలు ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వంశపార్యపరంగా మూత్రాశయ సమస్యలు ఉన్న కుటుంబాలలో వారికి, మూత్రాశయానికి నష్టం చేకూర్చే కొన్ని రకాల మందులు వినియోగించే వారికి కూడా మూత్రాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం.

Laptop: ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఈ 6 తప్పులు చేశారంటే భారీగా నష్టపోవడం ఖాయం!



మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు.. (bladder cancer symptoms)

మూత్రాశయ క్యాన్సర్ ఉన్నవారు మూత్రాన్ని నియంత్రించుకోలేరు. మూత్రంలో రక్తం పడటం, మూత్రం రంగు గులాబీ-ఎరుపు, ముదురు ఎరుపు, గోధుమ రంగు మొదలైన రంగులలో ఉంటుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రవిసర్జన చేయాలని పదే పదే అనిపించడం జరుగుతుంది. కానీ మూత్రవిసర్జనకు వెళితే మాత్రం అసలు మూత్రం రాదు. ఇవి మాత్రమే కాకుండా మూత్ర విసర్జన సమయంలో మంట, పొత్తి కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అలసట నీరసం, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం మొదలైనవ్నీ మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలే.

మూత్రాశయ క్యాన్సర్ మగవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నా మహిళలలో కూడా ఈ సమస్య రావచ్చు. మహిళలలో ఈ లక్షణాలు మగవారికి కాస్త భిన్నంగా ఉంటాయి. మూత్రాశయం నిండకపోయినా మూత్రవిసర్జన చేయాలని అనిపించడం ప్రధానంగా కనిపిస్తుంది. మూత్రం ఆపుకోలేకపోవడం, పొత్తి కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు, ఉన్నట్టుండి బరువు తగ్గడం, మొదలైన లక్షణాలు మహిళలలో కనిపిస్తాయి.

Health Facts: శుభ్రంగా బ్రష్ చేసుకున్నా సరే.. నోట్లో చెడు వాసన పోవడం లేదా..? ఈ 5 చిట్కాలను పాటిస్తే సరి..!


Updated Date - 2023-10-03T11:10:28+05:30 IST