Health Tips: ఒళ్ళు నొప్పులు అనగానే పెయిన్ కిల్లర్లు వాడుతున్నారా? మందులేమీ అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు..
ABN , First Publish Date - 2023-07-19T12:14:51+05:30 IST
మహిళలలో 60నుండి 85శాతం మంది కండరాల నొప్పులతో బాధపడుతుంటారు. వీరిలో అధికశాతం మంది చేసేపని నొప్పుల నివారణగా పెయిన్ కిల్లర్లు వాడటం. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే..
శారీరక అనారోగ్యాలు ఏవీ లేకున్నా సరే చాలామందిని కనీసం ఒళ్లు నొప్పులైనా పట్టుకుంటాయి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉద్యోగం చేయడం, ఎక్కువ దూరం కార్, బైక్ డ్రైవ్ చేయడం వంటి కారణాల వల్ల కాళ్ళు, చేతులు, నడుము భాగాల్లో కండరాలు నొప్పి(Muscle pains) పెడుతుంటాయి. కండరాల నొప్పులకు ప్రధాన కారణం శరీరంలో లాక్టిక్ యాసిడ్(lactic acid) ఎక్కువ ఉత్పత్తి కావడం. ఇది కండరాలలో పేరుకుని పోవడం వల్ల కండరాల నొప్పులు, కండరాల తిమ్మిర్లు, వస్తాయి. దీని కారణంగా కండరాలకు ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలలో 60నుండి 85శాతం మంది కండరాల నొప్పులతో బాధపడుతుంటారు. వీరిలో అధికశాతం మంది చేసేపని నొప్పుల నివారణగా పెయిన్ కిల్లర్లు వాడటం. కానీ పెయిన్ కిల్లర్లు అధికంగా వినియోగించడం మంచిది కాదు. ఈ కండరాల నొప్పుల నివరాణకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు(Muscle pain relief tips) ఉన్నాయి. ఈ చిట్కాలు ఫాలో అయితే మంత్రమేసినట్టు కండరాల నొప్పులు మాయమవుతాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..
వెల్లుల్లి, ఆవాల నూనె..(garlic, mustard oil)
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కండరాల నొప్పిని నివారిస్తుంది. ఇక ఆవాల నూనె కండరాల నొప్పికి ఆయుర్వేదం చెప్పిన అధ్బుతమైన ఔషదం. ఆర్థరైటిస్(arthritis) తో సహా కండరాల నొప్పులను తగ్గించే శక్తివంతమైన గుణాలు ఆవాల నూనెలో ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలను దంచి ఆవాల నూనెలో వేసి మరిగించాలి. ఈ నూనె గోరువేచ్చగా ఉన్నప్పుడు నొప్పిగా ఉన్న కండరాల ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది అద్బుతమైన ఫలితాలు ఇస్తుంది.
Viral: స్వర్గంలో ఉన్న బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రెండింతల లాభమంటూ నమ్మించి.. రూ.2.76 కోట్లు కొట్టేశాడు..!
అల్లం..(ginger)
అల్లం ఉపయోగించడం వల్ల కండరాల నొప్పులు ఊహించని విధంగా తగ్గుముఖం పడతాయి. అల్లంలో ఉండే అనాల్జేసిక్, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాల ఒత్తిడి తగ్గిస్తుంది.
నీలగిరి తైలం..(eucalyptus oil)
యూకలిప్టస్ ఆయిల్ గా పిలిచే నీలగిరి తైలం కండరాల నొప్పిని తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. నీలగిరి తైలంలో కూడా అనాల్డేసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కండరాల నొప్పి కారణంగా వాపు ఉన్న సమయంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. నీలగిరి తైలాన్ని కండరాల ప్రాంతంలో మసాజ్ చేస్తే నొప్పులు తొందరగా తగ్గుతాయి.
ప్రతిరోజు పసుపు కలిపిని పాలు తాగడం, పండు మిరపకాయలు, నల్ల మిరియాలు ఆహారంలో తీసుకోవడం చేస్త్ కండరాల నొప్పులు చాలా తొందరగా తగ్గుతాయి.
కండరాల నొప్పులకు ఏ నూనెను ఉపయోగించినా ఆ తరువాత వేడి కాపడం పెట్టడం మరింత ఉపశమనాన్ని ఇస్తుంది. రోజులో రెండుసార్లు ఈ పద్దతి ఫాలో అయితే మందుల అవసరం లేకుండానే కండరాల నొప్పి నుండి ఉపశమనం దొరికినట్టే.