Health Tips: తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్లు వాడుతున్నారా? ఇలా చేశారంటే నిమిషాల్లో తగ్గిపోవడం ఖాయం..
ABN , First Publish Date - 2023-05-28T17:14:46+05:30 IST
తలనొప్పి తగ్గడానికి చాలా సులువైన చిట్కాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే ఎలాంటి పెయిన్ కిల్లర్లు లేకుండా నిమిషాల్లో తలనొప్పి మాయమవుతుంది.
రోజువారీ జీవితంలో ఎదురయ్యే సాధారణ ఆరోగ్య సమస్యలలో తలనొప్పి(Head ache) కూడా ఒకటి. తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గడం నుండి విటమిన్ లోపం వరకు చాలా కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. నుదురు, తల పైభాగంలో ఉండే కండరాలు, తల చుట్టూ ఉండే కణజాలాలు, స్వర పేటిక, సైనస్ లు, ధమనులు, సిరలు మొదలైన వాటిలో నొప్పిని గ్రహించే వ్యవస్థ ఉంటుంది. ఇవి ఏదైనా ఒత్తిడికి గురైనపుడు, ఆ భాగాలలో ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది. మెగ్నీషియం, విటమిన్-డి, బి-కాంప్లెక్స్ విటమిన్ల లోపం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కానీ తలనొప్పి తగ్గడానికి చాలా సులువైన చిట్కాలు ఉన్నాయి. ఇవి ఫాలో అయితే ఎలాంటి పెయిన్ కిల్లర్లు లేకుండా నిమిషాల్లో తలనొప్పి మాయమవుతుంది.
ఆక్యుప్రెషర్.. (Acupressure)
తలనొప్పిని నిమిషాల్లో తరిమికొట్టడానికి ఆక్యుప్రెషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. రెండు చేతులను ముందుకు చాచాలి. చూపుడు వేలు, బొటనవేలు మధ్య భాగంలో తేలికపాటిగా మరొక చేతి చూపుడువేలు, బొటన వేలితో మసాజ్ చెయ్యాలి. ఒక్కోచేతికి రెండు నుండి నాలుగు నిమిషాలు చొప్పున ఇలా చేస్తే తలనొప్పి నిమిషాల్లో మాయమవుతుంది.
Viral Video: ఈ జింక ఎందుకిలా చేస్తోంది..? ఆ చిన్నారి అసలేం చెప్పింది..? నెటిజన్ల మనసును కట్టిపడేస్తున్న వీడియో ఇది..!
లవంగాలు..(cloves)
తలనొప్పి తగ్గడానికి మరొక బెస్ట్ ఆప్షన్ లవంగాలు. లవంగాలను పాన్ మీద వేసి వేయించాలి(fry cloves in a pan). వేగిన లవంగాలను పలుచని బట్టలో వేసి చిన్న మూటలాగా కట్టాలి. పదే పదే లవంగాల వాసన చూస్తోంటే తలనొప్పి తగ్గిపోతుంది(clove smell reduce head ache).
తలనొప్పి తగ్గించుకోవడానికి లవంగాలను మరొక విధంగా కూడా ఉపయోగించొచ్చు. 8-10లవంగాలను పొడిగా(Clove powder) చెయ్యాలి. ఈ పొడిని కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెలో(coconut oil or olive oil) వేసి ఉంచాలి. సుమారు గంట పాటు దాన్ని అలాగే ఉంచి ఆ తరువాత వడగట్టాలి. ఈ నూనెను నుదురు, కణతలమీద కొద్దిగా వేసి మసాజ్ చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. దీన్ని ముందే తయారుచేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
ఎండ నుండి ఇంటికి రాగానే తలనొప్పిగా ఉంటే.. (summer heat head ache)
వేసవికాలం ఎండనుండి ఇంటికి రాగానే తలనొప్పిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు గంధం చెక్కను(sandal wood) అరగదీసి గంధం పేస్ట్(sandal paste) తీసుకోవాలి. దీన్ని నుదురుకు అప్లై చేయాలి. ఎండ వల్ల వేడెక్కిన తలలోని కణాలు తొందరగా చల్లబడతాయి. ఇది మాత్రమే కాకుండా తులసీ-అల్లం టీ(ginger-basil tea), లెమన్ టీ(lemon tea), పలుచని మజ్జిగ(butter milk), పుచ్చకాయ రసం(water melon juice), కొబ్బరినీళ్లు(coconut water) తీసుకుంటే మరింత తొందరగా తలనొప్పి తగ్గుతుంది.