Health Tips: షాంపూలో పంచదారను కలిపి తలస్నానం చేయడమేంటని అవాక్కవుతున్నారా..? దీని వల్ల లాభాలేంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-13T14:39:08+05:30 IST

పంచదారను తలకు ఉపయోగించడం హెయిర్ కేర్(hair care) లో భాగంగా మారిందిప్పుడు. వినడానికి వింతగా, కొత్తగా అనిపిస్తుదంది కానీ..

Health Tips: షాంపూలో పంచదారను కలిపి తలస్నానం చేయడమేంటని అవాక్కవుతున్నారా..? దీని వల్ల లాభాలేంటో తెలిస్తే..!

కాఫీలు, టీలు, స్వీట్స్.. ఎవరికైనా నచ్చుతున్నాయంటే అవి తియ్గ్యగా ఉండటమే కారణం. పంచదార లేకుండా వీటి రుచిని ఊహించలేము. ఇప్పటికాలంలో అమ్మాయిలు ఈ పంచదారను సొందర్యసాధనంగానూ ఉపయోగిస్తున్నారు. పంచదారను స్క్రబ్ లా ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. అయితే పంచదారను తలకు(sugar for hair)ఉపయోగించడం గురించి ఎప్పుడైనా విన్నారా? పంచదారను తలకు ఉపయోగించడం హెయిర్ కేర్(hair care) లో భాగంగా మారిందిప్పుడు. వినడానికి వింతగా, కొత్తగా అనిపిస్తుదంది కానీ పంచదారను షాంపూలో కలిపి తలస్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే అవాక్కవుతారు. ఇంతకీ పంచదారను తలకు ఎందుకు ఉపయోగించాలి? దీని వల్ల కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

ఇప్పడు వర్షాకాలం(monsoon) మొదలయ్యింది. వర్షం పడుతోందని జరగాల్సిన పనులు ఎవరూ ఆపుకోలేరు. కొన్నిసార్లు వర్షంలో తడుస్తూ పనులు చక్కబెట్టేసుకుంటారు. అయితే వర్షంలో తడవగానే చాలామందికి చుండ్రు(dandruff) వస్తుంది. మొదటే చుండ్రుతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది. చుండ్రు వల్ల జుట్టు రాలడం(Hair fall), వెంట్రుకలు విరిగిపోవడం(hair break), తలలో దురద, పుండ్లు(itching, sores)వంటి సమస్యలకు దారితీయడం ఇలా చాలా పరిణామాలు ఉంటాయి. కానీ పంచదార ఎంత మొండి చుండ్రుకు అయినా అద్భుత పరిష్కారంగా నిలుస్తుంది. దీన్ని వాడటం కూడా చాలా సులువు.

Viral Video: సింహాన్ని చూడగానే భయపడిన గున్న ఏనుగులు.. వెంటనే పెద్ద ఏనుగులు ఏం చేశాయో చూస్తే..


ఎలా వాడాలంటే..

కొద్దిగా షాంపూలో ఒక టేబుల్ స్పూన్ పంచదార కలిపి బాగా మిక్స్ చెయ్యాలి(sugar mix with shampoo). ఈ మిశ్రమంతో తలస్నానం(Head bath) చెయ్యాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తుంటే ఎంత మొండి చుండ్రు అయినా వదిలిపోతుంది. నిజానికి చక్కెరలో హెయిర్ కండీషనింగ్(hair conditioning) లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఈ లక్షణాలు తలలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను లోతుగా తొలగిస్తుంది. ఈ కారణంగా చుండ్రును తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పంచదార కారణంగా జుట్టుకు తీపి పట్టేసి చీమలు గట్రా అటాక్ చేస్తాయేమోననే కంగారు అక్కర్లేదు. ఎందుకంటే షాంపూ చేసిన తరువాత జుట్టును మంచినీటితో శుభ్రంగా కడిగేస్తుంటాం కాబట్టి అలాంటి సమస్య ఉండదు.

Viral: కాపాడండి.. అంటూ ఓ మహిళ అరుపులు.. పక్కింటి వ్యక్తి ఫోన్ చేస్తే క్షణాల్లో దిగిన పోలీసులు.. ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే..!


Updated Date - 2023-07-13T14:39:08+05:30 IST