Health Tips: కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఇదేనా.. కేవలం ఇదొక్కటి తాగడం వల్ల అంత మ్యాజిక్కా..

ABN , First Publish Date - 2023-10-10T13:25:47+05:30 IST

కొరియన్ స్కిన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఎంతోమంది అద్దంలాంటి చర్మం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి అందం వెనుక అసలు రహస్యం ఇదీ..

 Health Tips: కొరియన్ అమ్మాయిల అందం వెనుక రహస్యం ఇదేనా.. కేవలం ఇదొక్కటి తాగడం వల్ల  అంత మ్యాజిక్కా..

ప్రపంచంలో కొరియన్ అమ్మాయిలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి చర్మం అద్దంలా మెరుస్తూ ఉండటమే కాదు, ఎక్కడా చిన్న మచ్చ కానీ, ముడుత కానీ ఉండదు. ఎంతోమంది ఈ తరహా అందం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొరియన్ అమ్మాయిల చర్మం వెనుక రహస్యం బయటపడింది. తమ చర్మాన్ని బిగుతుగా, అందంగా ఉంచుకోవడానికి బోరి చా అనే టీని తాగుతారు. బోరి చా అంటే బార్లీ గింజలతో తయారుచేసే టీ. ఈ టీ చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటు, చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది. కేవలం టీ మాత్రమే కాదు బార్లీ గింజలను అందం కోసం వివిధ పద్దతులలో ఉపయోగిస్తారు. అసలు బార్లీ టీ ఎలా చేయాలి? బార్లీ గింజలను ఇంకా ఎలా ఉపయోగించాలి తెలుసుకుంటే..

బార్లీ టీ..(Barley Tea)

బార్లీ టీని తయారుచేయడం సులువు. కప్పు బార్లీ గింజలను సన్నని మంట మీద గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తాయివి. వేగిన తరువాత వీటిని ఒక కప్పులో పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. మరుగుతున్న నీటిలో వేయించిన బార్లీ గింజలు వేసి 15-20నిమిషాలు ఉడికించాలి. తరువాత వడగట్టుకుని తాగాలి. దీన్ని వేడిగా అయినా, చల్లగా అయినా తాగవచ్చు. కావలసినవారు తీపిని కూడా జోడించుకోవచ్చు.

బార్లీ టీని కేవలం తాగడానికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా ఉపయోగించవచ్చు. బార్లీ టీని టోనర్ గా ఉపయోగించవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్ చేసి ఆ ఐస్ ముక్కలతో ముఖం మీద సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఇక జుట్టు మెరిసిపోవాలని అనుకునేవారు బార్లీ టీతో జుట్టును కడగడం ద్వారా జుట్టు మెరవడమే కాదు, క్రమంగా మందంగా మారుతుంది.

Apple seeds: యాపిల్‌ను తింటూ.. దానిలోని విత్తనాన్ని పారేస్తున్నారా..? అయితే ఈ నిజం తెలుసుకోవాల్సిందే..!


బార్లీ టీ ఇతర ప్రయోజనాలు..

బార్లీ టీ శరీరానికి చలువ చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇలా ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు దీన్ని తాగితే ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.

బార్లీ టీలో క్వెర్సిటిన్, కాటెచిన్ సహా బోలెడు యాంటీ ఆక్సిడెట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. దీంతో ముఖం మీద మొటిమలు, ముడుతలు, గీతలు మచ్చుకైనా కనిపించవు.

శరీరలో రక్తాన్ని శుద్దిచేయడం నుండి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం వరకు బార్లీ టీ సహాయపడుతుంది. ప్రతిరోజూ బార్లీ టీ తాగుతుంటే ముఖ సౌందర్యం కోసం ఎలాంటి క్రీములు, లోషన్లు రాసుకోవాల్సిన అవసరమే ఉండదట.

Viral: ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..


Updated Date - 2023-10-10T13:25:47+05:30 IST