Health Tips: పిచ్చి గడ్డి అని పీకి పారేస్తున్నారు కానీ.. అసలు నిజాలు తెలిస్తే బంగారంలా పెంచుకుంటారు.. జ్యూస్‌గా చేసుకుని తాగితే..
ABN , First Publish Date - 2023-06-20T15:33:33+05:30 IST
ఈ గడ్డి దేనికీ పనికిరాదని, దీనిస్థానంలో ఏ పూలమొక్కనో పెంచుకోవచ్చనే కారణంతో చాలా మంది పీకి పారేస్తుంటారు. కానీ ..
ఎవరికైనా ఇంటిముందు కాస్త స్థలం ఉంటే చాలు పూలమొక్కలు, అలంకరణ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీటిమధ్యన గడ్డిలాగా ఓ మొక్క పెరుగుతుంది. దీనిని దుర్వా పత్రం అని, గరిక అని అంటారు. వినాయకుడి పూజలో ప్రముఖంగా వాడే ఈ గరిక గడ్డి దేనికీ పనికిరాదని, దీనిస్థానంలో ఏ పూలమొక్కనో పెంచుకోవచ్చనే కారణంతో చాలా మంది పీకి పారేస్తుంటారు. కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే దీన్ని బంగారంలా పెంచుకుంటారు. ఈ గరిక గడ్డిని జ్యూస్ చేసుకుని తాగితే శరీరంలో మ్యాజిక్ జరుగుతుందంటే దాని గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది. ఇంతకీ ఈ గరిక గడ్డి ఎందుకంత గొప్పది? దీని ఉపయోగాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
గరికను(doob grass, durva grass) వినాయకుడి పూజలోనూ(Ganesh pooja), పూజలు, వ్రతాలు, శుభకార్యాలలోనూ ఉపయోగిస్తారు. ఇది ఎంతో పవిత్రమైనది. కేవలం పూజల దృష్ట్యా మాత్రమే కాదు ఆయుర్వేదంలో గరిక ఓ గొప్ప ఔషదం(ayurvedic medicine). ఈ గరిక పంటపొలాలు, గుడులు, ఇంటి ఆరుబయట ప్రాంతాలలో విరివిగా పెరుగుతుంది. పనికి రాదని పీసేసే ఈ గరిక గొప్ప ఆరోగ్యం చేకూరుస్తుంది. ఎంత ఎండలో అయినా పచ్చగా పెరిగే ఈ గరిక మధుమేహ(diabetes) బాధితులకు గొప్ప వరం అని చెప్పవచ్చు. గుప్పెడు గరికను నీటిలో వేసి గ్రైండ్ చేసి దాన్ని వడగట్టుకుని తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి(control blood suger levels). ఈ జ్యూస్ వల్ల మధుమేహం ఉన్నవారిలో హైపోగ్లైసీమిక్ ప్రభావం ఉంటుంది.
Viral Video: అపార్ట్మెంట్ అంచున నిలబడి దూకేందుకు సిద్ధమైన మహిళ.. కేవలం 30 సెకన్లలోనే ఊహించని సీన్..!
శరీరంలో కఫం, పిత్త అసమతుల్యతలు ఉన్నవారు ఈ గరిక జ్యూస్ తాగితే కఫం, పిత్తం సమతుల్యం అవుతాయి. అదేవిధంగా రక్తం శుద్ది అవుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది(control cholesterol). గరికను గ్రీన్ బ్లడ్(green blood) అని పిలుస్తారు. గరిక జ్యూస్ ఎర్రరక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది(increase red blood cells). ఈ కారణంగా రక్తహీనత(anemia) ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. గరికలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గరిక జ్యూస్ తీసుకుంటే పోషకాల లోపం(nutrient deficiency) తీర్చడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, పంటినొప్పి ఉన్నప్పుడు గరిక రసంలో తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతాయి. గరిక దొరకనప్పుడు ఎండు గరికలో కూడా నెయ్యి లేదా తేనె కలిపి తీసుకోవచ్చు. కడుపునొప్పి, కడుపులో పుండ్లు, కండరాల తిమ్మిరి ఉన్నప్పుడు గరిక జ్యూస్ తీసుకుంటే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇది కాలేయాన్ని(cleans the liver) శుద్ది చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు(insomnia), మానసిక ఒత్తిడి(depression) సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు, మైగ్రేన్(migraine) సమస్య ఉన్నవారికి గరిక జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం మీద దద్దుర్లు, ర్యాషెస్ వచ్చినప్పుడు గరిక పేస్ట్ లో పసుపు కలిపి రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా గరిక సంజీవనిలా పనిచేస్తుంది.