Prime Minister Salary: ప్రపంచ దేశాల్లో ఏ ప్రధానమంత్రికి శాలరీ ఎక్కువ..? భారత ప్రధాని మోదీకి ఏటా అసలెంత జీతమంటే..?

ABN , First Publish Date - 2023-09-15T15:52:30+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా, ప్రగతి పథంలో ముందుకు నడవాలన్నా అక్కడి రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకం. అలాంటి రాజకీయ వ్యవస్థను నడిపించే నాయకులు అత్యంత శక్తివంతులుగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అధిక ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు.

Prime Minister Salary: ప్రపంచ దేశాల్లో ఏ ప్రధానమంత్రికి శాలరీ ఎక్కువ..? భారత ప్రధాని మోదీకి ఏటా అసలెంత జీతమంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా, ప్రగతి పథంలో ముందుకు నడవాలన్నా అక్కడి రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకం. అలాంటి రాజకీయ వ్యవస్థను నడిపించే నాయకులు అత్యంత శక్తివంతులుగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అధిక ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎంతో మంది ప్రస్తుతం చాలా శక్తివంతమైన దేశాలను నడుపుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అమెరికా (America), రష్యా (Russia) అధ్యక్షుల నుంచి భారత ప్రధాని వరకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇంత పెద్ద వ్యవస్థలను నడుపుతున్న వీరు ఎంతెంత జీతాలు తీసుకుంటారనేది చాలా ఆసక్తికరం (Highest-paid leaders in the world).

ప్రపంచంలో ఏ దేశ నాయకుడు అత్యధిక జీతం అందుకుంటున్నాడు? అని ఎవరినైనా ప్రశ్నిస్తే ముందుగా అమెరికా, చైనా లైదా బ్రిటన్ అధినేతల పేర్లు చెబుతారు. అయితే అత్యధిక జీతం తీసుకుంటున్న దేశ నాయకుడు ఎవరో తెలుసా? వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, సింగపూర్ ప్రధాన మంత్రి ( Singapore Prime Minister) లీ హ్సీన్ లూంగ్ ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్నారు. లూంగ్ ఏడాదికి దాదాపు 2.2 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 18 కోట్లు జీతం పొందుతున్నారు. ఇక, ఆ తర్వాతి స్థానంలో హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Hong Kong CEO) జాన్ లీ కా చియు ఉన్నారు. చియు ఏడాదికి దాదాపు రూ.6 కోట్ల జీతం పొందుతారు.

Loan: గ్యారెంటీ లేకుండా లోన్.. వడ్డీ కూడా చాలా తక్కువండోయ్.. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ గురించి తెలుసా..?

ఇక, ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని (Australia P.M.) ఏడాదికి రూ.4.57 కోట్ల జీతం తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో అమెరికా అధ్యక్షుడు (America President Salary) బైడెన్ ఉన్నారు. ఆయన వార్షికాదాయం 3.2 కోట్లు ఉంటుంది. వీరి తర్వాతే మిగతా దేశాధినేతల జీతాలు ఉన్నాయి. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోదీ నెల జీతం కేవలం రూ.2 లక్షలు మాత్రమే (Prime Minister Salary). అలాగే రష్యా అధ్యక్షుడి వార్షికాదాయం రూ.1.13 కోట్లు. ఇక, చైనా అధ్యక్షుడు ఏడాదికి కేవలం రూ. 18 లక్షల జీతం మాత్రమే అందుకుంటున్నారు.

Updated Date - 2023-09-15T15:52:30+05:30 IST