ఒక్క ఇంజెక్షన్ ఇస్తే అబ్బాయిలే పుడతారట.. వెయ్యేళ్ల క్రితం నాటి ఆయుర్వేద వైద్యమట.. మార్కెట్లో నయా దందా.. క్యూ కడుతున్న దంపతులు..!

ABN , First Publish Date - 2023-02-20T17:07:55+05:30 IST

మగపిల్లాడు వంశాకురమనే ఆలోచనతో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తరువాత కూడా మగ పిల్లాడి కోసం ట్రై చేసేవాళ్ళున్నారు. ఇలాంటి వాళ్లే వీరి టార్గెట్.

ఒక్క ఇంజెక్షన్ ఇస్తే అబ్బాయిలే పుడతారట.. వెయ్యేళ్ల క్రితం నాటి ఆయుర్వేద వైద్యమట.. మార్కెట్లో నయా దందా.. క్యూ కడుతున్న దంపతులు..!

అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు.. అని ఓ పాత సినీ గేయ రచయిత రాశాడు. ఎంతో మంది భార్యాభర్తలు పిల్లలకోసం ఎదురుచూస్తున్నా ఎక్కువ భాగం మంది ఇప్పటికీ మగపిల్లాడికే మొదటి ఓటు వేస్తున్నారు. మగపిల్లాడు వంశాకురమనే ఆలోచనతో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తరువాత కూడా మగ పిల్లాడి కోసం ట్రై చేసేవాళ్ళున్నారు. ఇలాంటి వాళ్లే వీరి టార్గెట్. అక్కడ ఒకే ఒక ఇంజక్షన్ ఇస్తారట. దాంతో అబ్బాయి పుట్టడం కచ్చితమంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ గాయత్రి నగర్ లో అభయ్ ఆయుర్వేద-పంచకర్మ హాస్పిటల్ ఉంది. మగపిల్లాడు కావాలని అనుకునే మహిళలు ఇక్కడికి కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. అక్కడ మగపిల్లాడు పుట్టడానికి వైద్యం ఇస్తామని చెబుతున్నారు. దీనికోసం 15వేల రూపాయలతో థెరపీ తీసుకోవాలని అంటున్నారు. ఒక్కొక్క థెరపీ 1000రూపాయలని, అలా 15 థెరపిలు తీసుకుంటే మగపిల్లాడు కచ్చితంగా పుడతాడని గ్యారెంటీ ఇస్తున్నారు. అభయ్ ఆయుర్వేద హాస్పిటల్ వైద్యుడు ఘనశ్యామ్ మాట్లాడుతూ తమ దగ్గర మందు తీసుకున్న వారిలో 95శాతం మహిళలు మగపిల్లాడిని పొందారని చెప్పాడు. 10వేల సంవత్సరాల కిందటి ఆయుర్వేద గ్రంథాల ఆధారంగా ఔషధం ఇస్తామని ఈయన పేర్కొన్నాడు. వైద్యశాస్త్రం ఇలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని, క్రోమోజోములతో సహా ఇతర విషయాలను ఇంగ్లీష్ వైద్యం సరిగ్గా కనుక్కోలేదని చెప్పాడు.

Read also: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి షాకింగ్ అనుభవం.. నదిలో వల విసిరితే చేపలతో పాటు ఏం బయటకు వచ్చిందో చూసి..


ఇదిలా ఉండగా సికార్ లో కూడా ఇలాంటి వైద్యం ఒకటి కొనసాగుతోంది. ధన్వంతరి నేచురల్ హాస్పిటల్ లో 980 రూపాయలకు మందు ఇస్తున్నారు. దీన్ని ఉపయోగించడం వల్ల 80 నుంచి 90శాతం మగపిల్లాడు పుట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మందు వాడిన 10మంది మహిళలల్లో 8 మంది మగపిల్లాడికి జన్మను ఇస్తున్నారని చెప్పారు.

అక్కడి జిల్లా అధికారులు, ఇతర వైద్యులు మాట్లాడుతూ మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అనేది ఎవ్వరూ ముందే డిసైడ్ చెయ్యలేరని చెప్పారు. ప్రజల బలహీనతతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మగపిల్లాడు పుడతాడాని హామీ ఇచ్చేవాళ్లను నమ్మద్దని అధికారులు ప్రజలకు చెబుతున్నారు. కానీ మగపిల్లాడనే వారిని ఆసుపత్రుల వైపు నడిపిస్తోంది.

Updated Date - 2023-02-20T17:08:07+05:30 IST