యుద్ధ సమయాన సైనికులు ధరించే అమ్యునిషన్ బూట్లు ఎంత ప్రత్యేకమైనవంటే...
ABN , First Publish Date - 2023-04-10T10:58:56+05:30 IST
ఆర్మీలో సైనికులు వినియోగించే అమ్యునిషన్ బూట్లు(Ammunition boots) అత్యుత్తమ నాణ్యతతో తయారు చేస్తారు. వీటిని సైనికులు యుద్ధసమయం(war time)లో ఉపయోగిస్తారు.
ఆర్మీలో సైనికులు వినియోగించే అమ్యునిషన్ బూట్లు(Ammunition boots) అత్యుత్తమ నాణ్యతతో తయారు చేస్తారు. వీటిని సైనికులు యుద్ధసమయం(war time)లో ఉపయోగిస్తారు. ఈ బూట్లు చాలా మన్నికైనవి. లెథెరెట్, సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ బూట్లు(shoes) ఏ వాతావరణంలోనైనా నడవడానికి అనువుగా ఉంటాయి. సైనికులకు అత్యుత్తమ సౌలభ్యం అందించే విధంగా అమ్యునిషన్ బూట్లు ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి చీలమండ గాయాల నుండి సైనికులను(Soldiers) రక్షించడానికి ఎంతగానో ఉపకరిస్తాయి.
ఇవి అన్ని రకాల ఉపరితలాలపై(surfaces) గట్టి పట్టును నిర్వహించడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా జారే ఉపరితలాలపై కూడా ఈ షూలు మంచి పట్టును కలిగివుంటాయి. పర్వతారోహణకు(mountain climbing) కూడా ఈ బూట్లు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే వీటిని ధరించిన సైనికుల అరికాళ్ళకు గట్టి పట్టును కొనసాగించడంలో సహాయపడేలా స్పైక్(Spike)లు కూడా దీనిలో ఉంటాయి. సైనికులు బురద ప్రాంతం లేదా జారే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ బూట్లకు ఉండే హాబ్‌నెయిల్‌లను ఉపయోగిస్తారు. ఫలితంగా బూట్ల పట్టు బలంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది.