Share News

Cricket: క్రికెట్ బాల్స్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? అబ్బురపరిచే వీడియో..

ABN , First Publish Date - 2023-10-13T21:27:16+05:30 IST

క్రికెట్ బాల్స్ తయారీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌‌గా మారింది. వీటి తయారీ విధానాన్ని, కార్మికుల నైపుణ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Cricket: క్రికెట్ బాల్స్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా? అబ్బురపరిచే వీడియో..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాప్యులారిటీ ఉన్న ఆటల్లో క్రికెట్ కూడా ఒకటి. ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ మేనియా నెలకొంది. ప్రజల దృష్టంతా క్రికెట్‌పైనే ఉంది. ఇక భారతీయులకైతే క్రికెట్‌కు సంబంధించిన నిబంధనలు, ఇతర అంశాలు కొట్టిన పిండే. ఆటకు కీలకమైన బంతిని లెదర్‌తో తయారు చేస్తారన్న విషయమూ చాలా మందికి తెలుసు. అయితే, ఈ తయారీ విధానాన్ని(How cricket balls are made) ప్రత్యక్షంగా చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ప్రస్తుతం క్రికెట్ బాల్స్ తయారీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

Viral: నన్నేం చేయమంటారో మీరైనా చెప్పండి..నెట్టింట వ్యక్తి అర్థింపు.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌‌టాప్ ఆర్డరిచ్చాక..


బాల్స్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చాలా కూలంకషంగా చూపించారు. తొలుత లెదర్‌ను బంతిసైజుకు సరిపడా ముక్కలగా చేయడం, వాటిని కలిపి కుట్టడం ఇందులో చూడొచ్చు. తొలుత లెదర్ ముక్కలతో బంతిలోని రెండు సగ భాగాలను తయారు చేశాక వాటిని మధ్యలో ఓ కార్క్ బంతిని పెట్టి మూసేస్తారు. ఆ తరువాత చేతి పరికరాలతోనే వాటిని ఓదగ్గర పేర్చి మందపాంటి దారంతో 60 నుంచి 90 కుట్లు వేసి కుట్టేస్తారు. ఆ తరువాత ఓ మోల్డ్‌లో పెట్టి బంతికి పూర్తి గోళాకారం వచ్చేలా ఒత్తుతారు. అనంతరం, వాటికి మెరుపు వచ్చేలా లాకర్‌తో పాలీష్ చేస్తారు.

Viral: పబ్లిక్‌గా పోలీసుపై రెచ్చిపోయిన మహిళ.. వద్దు వద్దు అంటున్నా వినకుండా.. వైరల్ వీడియో


నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బంతులు నైపుణ్యంగా తయారు చేస్తున్నా వారిపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఇవి రెడ్ బాల్స్ అని, వీటిని కేవలం టెస్ట్ మ్యాచుల్లోనే ఉపయోగిస్తారని చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్‌లో తెల్ల బంతులు వాడతారని అన్నారు. జనాలకు ఈ వీడియో తెగ నచ్చడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: భార్యాపిల్లలతో పాటూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన వ్యక్తిని చూసి సిబ్బంది షాక్.. అతడేం చేశాడంటే..

Updated Date - 2023-10-13T21:31:28+05:30 IST